కూతురి ప్రేమ.. బిగ్ బాస్ లో నిలదీసిన తండ్రి

Thu Sep 12 2019 14:57:48 GMT+0530 (IST)

Losliya father enters the Bigg Boss house

బిగ్ బాస్.. ఈ రియాలిటీ షో ఇప్పుడు దేశవ్యాప్తంగా  ఎంతో పాపులర్ అయిపోయింది. ప్రతి ప్రాంతీయ భాషలోనూ ఈ షో ప్రసారమవుతూ అభిమానులను అలరిస్తోంది. తెలుగు బిగ్ బాస్ మొన్ననే 50 రోజులకు చేరుకోగా.. తమిళ బిగ్ బాస్ అప్పుడే 80వ రోజుకు చేరింది. మరో 20 రోజులే మిగిలి ఉంది.దీంతో కంటెస్టెంట్లకు హోమ్ సిక్ వచ్చేసింది. తమ వారిని చూడాలన్న ఉబలాటం మొదలైంది. ఇదే అదునుగా తమిళ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. వారు ఎమోషనల్ అయిన తీరును ఎంత మిస్ అయ్యారో చూపించి ప్రేక్షకులను కట్టిపడేశారు.

తాజాగా బిగ్ బాస్ తమిళ షోలో తన అందం చాతుర్యంతో ఫుల్ పాపులర్ అయిన భామ లోస్లియా.. ఈమె తండ్రి తాజాగా బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆయన ప్రవర్తన చూసి లోస్లియా కంటెస్టెంట్లు షాక్ అయ్యారు. లోస్లియా తండ్రి రాగానే కూతురిపై తిట్లదండకం మొదలు పెట్టాడు.. ‘‘నిన్ను ఇలాగేనా పెంచింది.. బిగ్ బాస్ లో తోటి కంటెస్టెంట్ కెవిన్ తో ఆ ప్రేమాయణం ఏంటంటూ’’ చీవాట్లు పెట్టాడు.  తండ్రి తీరుతో లోస్లియా గుక్కపట్టి ఏడ్చేసింది. ఈ ప్రోమోను తాజాగా తమిళ బిగ్ బాస్ నిర్వాహకులు విడుదల చేశారు..

కూతురు బిగ్ బాస్ లో ప్రేమాయణం చూసి తండ్రి రియాక్ట్ అయిన వివాదంపై నెటిజన్లు తప్పుపడుతున్నారు. కూతురు అందరి అభిమానం పొందింనందుకు సంతోషించక ఇలా ప్రేమిస్తుందని తిడుతావా అంటూ తండ్రిని తప్పుపడుతున్నారు. ప్రేమించడం తప్పా అంటూ యువత నిలదీస్తున్నారు. బిగ్ బాస్ తమిళ షోలో ఇప్పుడు లోస్లియా-ఆమె తండ్రి వ్యవహారమే హాట్ టాపిక్ గా మారింది.