తాప్సి సినిమాకు భీమా.. కరోనా టెన్షన్ లేదు

Sat Jul 11 2020 19:00:14 GMT+0530 (IST)

Insurance for Taapsi movie .. no Virus tension?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్న నేపథ్యంలో అన్ని రంగాల వారు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. మే నెల వరకు షూటింగ్ కు అనుమతులు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసిన స్టార్స్ ఇప్పుడు షూటింగ్స్ కు అనుమతించిన తర్వాత కూడా షూటింగ్ కు వెళ్లడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ కు వెళ్లడం అంటే ప్రమాదంను కొని తెచ్చుకోవడమే అంటూ భయపడుతున్నారు. షూటింగ్ కు వెళ్లిన పలువురు కరోనా బారిన పడటంతో ఈ నెల నుండి షూటింగ్ చేయాలనుకున్న వారు కూడా వెనుకడుగు వేస్తున్నారు.కొందరు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్ కు వెళ్తున్నారు. షూటింగ్ చేస్తున్న సమయంలో ఎవరైనా కరోనా భారిన పడితే తీవ్ర నష్టం తప్పదు. అయినా కూడా షూటింగ్స్ ను చేస్తున్నారు. అయితే ఆ నష్టంను తప్పించుకునేందుకు భీమా చేయించాలని బాలీవుడ్ నిర్మాత ఒకరు నిర్ణయించుకున్నారు. తాప్సి హీరోయిన్ గా రూపొందబోతున్న లూప్ లపేటా చిత్రానికి కరోనా భీమా చేయించారు.

చిత్రం షూటింగ్ కు వెళ్లబోతున్నామని.. మా యూనిట్ సభ్యుల్లో ఎవరికి అయినా కరోనా ఎటాక్ అయితే షూటింగ్ నిలిపేయాల్సి వస్తే అప్పుడు మాకు వచ్చే నష్టంను భీమా సంస్థ చెల్లించాల్సి ఉంటుందని నిర్మాత చెబుతున్నాడు. ఇండియాలో ఇలాంటి భీమా తీసుకున్న మొదటి సినిమాగా లూప్ లపేట రికార్డు దక్కించుకుంది. భీమా ఉందన్న ధీమాతో తాప్సి అండ్ టీం షూటింగ్ కు రెడీ అవుతున్నారు. వీరికి వర్కౌట్ అయితే ఇతర సినిమాలు కూడా భీమా చేయించి ధీమాగా షూటింగ్ కు వెళ్లే అవకాశం ఉంది.