ఈసారి ఖైదీ సీక్వెల్ లో తెలుగు యాక్టర్లు..!!

Tue Aug 04 2020 06:00:11 GMT+0530 (IST)

Telugu actors in the Khaidi sequel this time .. !!

తమిళ సినీహీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆయన నటించే సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అయి విడుదల అవుతుంటాయి. కార్తీ ఫస్ట్ మూవీ యుగానికి ఒక్కడు నుండి ఇటీవలి ఖైదీ వరకు అన్నీ తెలుగులో విడుదల అవుతూనే ఉన్నాయి. గతేడాది ఖైదీ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు కార్తీ. ఆ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా విడుదలైన ఈ మూవీ గత ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయి.. మంచి విజయం దక్కించుకుంది. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా రీమేక్ అవ్వనుంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కార్తీ ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. ఇళయదళపతి విజయ్ హీరోగా మాస్టర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే అయిపోయి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో ఓ చిత్రం రూపొందించనున్నాడు. అయితే ఖైదీ 2 సినిమా కోసం ఈసారి తెలుగు యాక్టర్లను తీసుకోనున్నారట. ఎందుకంటే ఖైదీలో హీరో కార్తీ తప్ప మిగతా వారెవరు తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కానీ సినిమాలో కంటెంట్ ఉండటం వలన మంచి విజయం సాధించింది. ఈసారి కూడా తెలుగులో మంచి విజయం సాధించాలని ఈ ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఓ యంగ్ హీరోతో పాటు పాపులర్ హీరోయిన్ని తీసుకోవాలని ప్లాన్. ఖైదీలో హీరోయిన్ లేకుండానే సినిమా నడిపించేసాడు డైరెక్టర్. గతంలో హీరోకి భార్య ఉంటుందని తెలిపాడు. అందుకే ఈసారి హీరోయిన్ ఉంటుంది. అయితే తెలుగు నుండి ఎవరు సెలెక్ట్ అయ్యారనే విషయం త్వరలో వెల్లడిస్తారట.