'ఖైదీ' డైరెక్టర్ తో మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్...?

Tue Aug 04 2020 12:40:33 GMT+0530 (IST)

Lokesh Kanagaraj To Direct Mahesh Next?

సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తదుపరి సినిమా 'సర్కారు వారి పాట'ను అనౌన్స్ చేసారు మహేష్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న 'సర్కారు వారి పాట' పై అటు మహేష్ ఫ్యాన్స్ లోనూ ఇటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన ఉంటుందని సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయింది.కాగా దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తర్వాత మహేష్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ చేసారు. అయితే రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' కంప్లీట్ చేసి.. మహేష్ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చాలా సమయమే పడుతుంది. అందుకే మహేష్ బాబు ఈ గ్యాప్ లో 'సర్కారు వారి పాట' ఫినిష్ చేసి మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ''ఖైదీ'' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ తో నెక్స్ట్ సినిమా చేయడానికి మహేష్ సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ''మాస్టర్'' సినిమా రూపొందిస్తున్న లోకేష్ కనకరాజన్ తదుపరి సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారితో చేయడానికి కమిట్ అయ్యారట. ఈ నేపథ్యంలో ఆల్రెడీ మహేష్ తో సినిమా నిర్మిస్తున్న మైత్రీ మూవీస్ వారు మహేష్ బాబు - లోకేష్ కనకరాజన్ కాంబినేషన్ లో మూవీ చేయాలని ప్లాన్స్ చేసుకున్నారట.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు బర్త్ డే నాడు 'సర్కారు వారి పాట' అప్డేట్ తోపాటు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వస్తుందని అనుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే మహేష్ మరో ఛాలెంజింగ్ రోల్ ప్లే చేసే అవకాశాలున్నాయని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ''మా నగరం'' ''ఖైదీ'' ''మాస్టర్'' వంటి సినిమాలు తెరకెక్కించిన లోకేష్ కనకరాజన్.. సూపర్ స్టార్ మహేష్ కోసం ఎలాంటి స్టోరీని రెడీ చేస్తారో చూడాలి. ఇక మహేష్ పుట్టినరోజు నాడు SSMB28 ప్రాజెక్ట్ పై క్లారిటీ రానుంది.