Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : నా చెప్పులతో గుర్తుపట్టేస్తారు.. లోబో ఓవర్ డబ్బా

By:  Tupaki Desk   |   14 Sep 2021 11:32 AM GMT
#BIGGBOSS5TELUGU : నా చెప్పులతో గుర్తుపట్టేస్తారు.. లోబో ఓవర్ డబ్బా
X
బిగ్‌ బాస్ తెలుగు సీజన్‌ 5 లో ఎంటర్ టైనర్‌ గా లోబో కు మంచి గుర్తింపు దక్కింది. మొదటి వారంలోనే నాగార్జున నుండి అతడికి ఎంటర్‌ టైనర్‌ ఆఫ్‌ ది హౌస్‌ దక్కింది. అంతటి మంచి పేరును దక్కించుకున్న లోబో ఇంటి సభ్యుల్లో కూడా చాలా మందితో ఫన్‌ చేస్తూ అందరిని ఆకట్టుకున్నాడు. యాంకర్‌ రవి మరియు లోబోల మద్య ఉండే బాండింగ్ గురించి అంతా కూడా ప్రత్యేకంగా చర్చించుకున్నారు. ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకుంటూ నవ్వించారు. అయితే నిన్న నామినేషన్‌ సమయంలో మాత్రం రవి నీ ఆట నీది నా ఆట నాది అనేవి షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. ఇన్నాళ్ల స్నేహంకు దండం అంటూ ఇక్కడ ఎవరి ఆట వారిదే అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరి మద్య అంతగా బాండింగ్ ఉన్న సమయంలో ఎలా లోబో అంత మాట అనేస్తాడు అంటూ కొందరు నోరు వెళ్లబెడుతున్నారు. నెట్టింట ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

లోబో తనను ఎవరైతే నామినేట్‌ చేశారో వారిపై విరుచుకు పడ్డాడు. మానస్ తనను నామినేట్‌ చేశాడనే కోపంతో ఆవేశంతో రెచ్చి పోయాడు. నీకు సాయం చేయాలనుకుంటే నాకు మంచి లెసెన్ చెప్పావు అంటూ వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో లోబో మాట్లాడుతూ నన్ను తక్కువ అంచనా వేయవద్దు. లోబో అనేది ఒక పేరు కాదు బ్రాండ్‌.. నన్ను పెద్ద పెద్ద స్టార్స్ గుర్తు పడతారు. నువ్వు ఎంత బచ్చావి అంటూ వ్యాఖ్యలు చేశాడు. నా చెప్పులను చూస్తేనే జనాలు గుర్తు పడతారు. నా గురించి ఎవరికి అయినా అడిగితే అందరు కూడా క్లీయర్ గా చెప్తారు. ఫాల్తు రీజన్స్ చెప్పి నామినేట్‌ చేయవద్దంటూ చాలా సీరియస్ అయ్యాడు. ఇద్దరి గొడవ ముదిరి చాలా దూరం వెళ్తుందని అనుకుంటూ ఉండగా మానస్ సైలెంట్‌ అవ్వడం జరిగింది. దాంతో లోబో గొడవ సర్దుమనిగింది.

తన డబ్బా తాను కొట్టుకునే సమయంలో లోబో చేసిన వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లోబో మంచి ఎంటర్‌ టైనర్‌ అనుకుంటే ఇలా అయ్యాడేంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బిగ్‌ బాస్ హౌస్ లో లోబో మరియు ఉమా లు సోమవారం ఎపిసోడ్ లో చేసిన రచ్చతో వారిద్దరిపై చాలా అగౌరవం ఏర్పడింది. ఈ వారంలో ఇద్దరు కూడా నామినేషన్ లో ఉన్నారు. దాంతో ఖచ్చితంగా ఆ ప్రభావం పడుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్‌ బాస్ నుండి మొదటి వారంలో సరయు వెళ్లి పోగా ఈ వారంలో ఆమె దారిలో వెళ్లేది ఎవరు అనేది వారి ప్రవర్తన బట్టి ఉంటుంది. ఎలిమినేషన్ నామినేషన్ సమయంలో వాడిన భాష మరియు పదాల కారణంగా లోబో మరియు ఉమా దేవిలు డేంజర్ జోన్ లో ఉన్నారని అంటున్నారు.