Begin typing your search above and press return to search.

లోడ్.. ఎయిమ్.. షూట్.. బాక్సాఫీస్ కు గురి పెడుతున్న 'RRR'

By:  Tupaki Desk   |   21 July 2021 2:45 PM GMT
లోడ్.. ఎయిమ్.. షూట్.. బాక్సాఫీస్ కు గురి పెడుతున్న RRR
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్ ఆర్ ఆర్'' (రౌద్రం రణం రుధిరం). 'బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం.. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ట్రిపుల్ ఆర్ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జక్కన్న ఆ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్లు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన 'రోర్ ఆఫ్ RRR' వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. దీనికి తగ్గట్లుగానే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేయడానికి రాజమౌళి అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేయగా.. రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఓ వైపు షూటింగ్.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. అలానే సినిమాని జనాల్లో ఎలా తెలిసిన మాస్టర్ మైండ్ జక్కన్న.. ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే RRR నటీనటులు - సాంకేతిక నిపుణులతో ఓ ప్రచార గీతాన్ని రెడీ చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

పాన్ ఇండియా మూవీగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ - అలియా భట్.. హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్ - అలిసన్ డూడీ - రే స్టీవెన్‌ సన్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. సముద్ర ఖని - శ్రియా కూడా ఇందులో కీ రోల్స్ లో కనిపించనున్నారు. 'RRR గర్జన' వీడియోలో వీరందరి పాత్రలను చూపించారు. తాజాగా 'లోడ్.. ఎయిమ్.. షూట్' అంటూ అజయ్ దేవగన్ తుపాకీ గుండు పట్టుకొని ఉన్న గ్లిమ్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాబోయే రోజుల్లో 'ఆర్ ఆర్ ఆర్' నుంచి మరిన్ని సర్ప్రైజింగ్ అప్డేట్స్ ఇవ్వనున్నారు.

కాగా, 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు - కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రాసుకున్న కల్పిత కథతో పీరియాడికల్ డ్రామాగా రూపొందిస్తున్నారు. రామరాజు గా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కె. కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డి.పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇకపోతే 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకు సంబంధించిన నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా డిజిటల్‌ మరియు శాటిలైట్‌ రైట్స్ డీల్ ఆల్రెడీ పూర్తయింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్‌ వారు పది భాషల హక్కులను అమ్మేసారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకి చెందిన ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్ జీ 5 గ్రూప్ కొనుగోలు చేసింది. అలానే దక్షిణాది భాషల శాటిలైట్ హక్కులు స్టార్‌ గ్రూప్ వారు చేజిక్కించుకోగా.. హిందీ శాటిలైట్‌ 'జీ సినిమా' సొంతం చేసుకుంది.