Begin typing your search above and press return to search.

యాక్షన్‌ సీన్‌ ను తలపించేలా రోప్స్‌ తో లిప్‌ లాక్‌ సీన్‌

By:  Tupaki Desk   |   28 Feb 2021 6:30 AM GMT
యాక్షన్‌ సీన్‌ ను తలపించేలా రోప్స్‌ తో లిప్‌ లాక్‌ సీన్‌
X
సొట్టబుగ్గల సుందరి తాప్సి ప్రస్తుతం లూప్‌ లపేటా చిత్రంలో తాహిర్‌‌ రాజ్‌ తో కలిసి నటిస్తోంది. సినిమాలో ఈ అమ్మడు రొమాంటిక్ సీన్స్ లో రెచ్చి పోయింది. ముఖ్యంగా గోవాలో జరిగిన షూటింగ్‌ విషయమై హీరో తాహిర్‌ మాట్లాడుతూ తాప్సిపై ప్రశంసలు కురిపించాడు. ఒక సారి స్క్రిప్ట్‌ కు ఓకే చెప్పిన తర్వాత మళ్లీ వెనుదిరిగి చూసుకోకుండా దర్శకుడు ఏది చెప్తే అది చేస్తూ ఉంటుంది. లాక్‌ డౌన్ సమయంలో పూర్తిగా ఇంటికే పరిమితం అయిన నేను డిప్రెషన్ కు గురి అయ్యాను. ఆ సమయంలో గోవా షెడ్యూల్‌ లో తాప్సితో రొమాంటిక్‌ సీన్స్ చేయడంతో పాటు ఆమెతో కలిసి నటించడంతో నా డిప్రెషన్‌ మొత్తం పోయింది. ఒక్కసారిగా నాది ఫ్రెష్‌ మైండ్‌ అయినట్లుగా అనిపించింది.

సినిమాలో ఒక ముద్దు సీన్‌ ఉంటుంది. దానిని రోప్ సాయంతో చేయడం జరిగింది. సహజంగా యాక్షన్‌ సీన్స్ ను రోప్‌ సాయంతో చేస్తూ ఉంటాం. కాని ఆ కిస్‌ సీన్‌ ను మాత్రం యాక్షన్‌ సీన్స్ మాదిరిగా రోప్‌ సాయంతో గాల్లో చేయడం జరిగింది. షూటింగ్‌ చేస్తున్న సమయంలో ఆ సన్నివేశం చాలా బాగా అనిపించింది. ప్రేక్షకులు దాన్ని ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి. గోవా బీచ్‌ సన్నివేశాలను నేను మర్చి పోలేకుండా ఉన్నాను అంటూ తాప్సి జ్ఞాపకాల్లో తేలిపోతున్నట్లుగా చెప్పాడు. వీరిద్దరి కాంబో సీన్స్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. మొత్తానికి మొదటి సారి తాప్సి రొమాంటిక్‌ సీన్స్ లో రెచ్చి పోయి నటించింది. మరి దీనికి ఎలా ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి.