Begin typing your search above and press return to search.

హీరో- నిర్మాత మ‌ధ్య వేడెక్కిస్తున్న‌ హాటీ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   21 Feb 2021 4:14 AM GMT
హీరో- నిర్మాత మ‌ధ్య వేడెక్కిస్తున్న‌ హాటీ ఎవ‌రు?
X
దాదాపు తొమ్మిది నెల‌ల గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్ నెమ్మ‌దిగా కోలుకుంటోంది. మ‌హ‌మ్మారీ క్రైసిస్ శాంతిస్తుడ‌డంతో వ‌రుస‌గా సినిమాలు రిలీజ‌వుతున్నాయి. ఆ క్ర‌మంలోనే పూరి-ఛార్మి-క‌ర‌ణ్ టీమ్ పాన్ ఇండియా లైగ‌ర్ ప‌నులు రీస్టార్ట్ చేశారు.

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌-అన‌న్య జంట‌పై కీల‌క షెడ్యూల్ ముంబైలో తెర‌కెక్కుతోంది. ఆ క్ర‌మంలోనే టీమ్ అంతా ముంబై లో షూటింగుల‌తో బిజీబిజీగా ఉంది. ప‌నిలోప‌నిగా గ్యాప్ దొరికితే చాలు హాట్ లేడీ ప్రొడ్యూస‌ర్ ఛార్మి కౌర్ తో యువ‌హీరో దేవ‌ర‌కొండ‌.. యువ‌నాయిక అన‌న్య పార్టీలతో చిలౌట్ మూవ్ మెంట్స్ ని ఆస్వాధిస్తున్నారు. ఇంత‌కుముందే ముంబై వీధుల్లో ఛార్మికౌర్ యాక్టివాను న‌డిపిస్తుంటే ఆ బ్యాక్ సీట్ లో దేవ‌ర‌కొండ ఎంతో హుషారుగా రైడ్ కెళుతూ క‌నిపించాడు.

తాజాగా ఆన్ లొకేష‌న్ నుంచి మ‌రో హాటెస్ట్ ఫోటో లీకైంది. ఈ ఫోటోలో హీరో నిర్మాత మ‌ధ్య‌లో హాటీ అన‌న్య మిడ్డీ డ్రెస్ లో చాలా వేడిగా క‌నిపిస్తోంది. నిర్మాత ఛార్మికి.. రౌడీ దేవ‌ర‌కొండ‌కు ఏం సీక్రెట్స్ చెబుతోందో కానీ... అన‌న్య మైమ‌రిచిపోయి త‌న్మ‌యంలో క‌నిపిస్తోంది. వీకెండ్ వైబ్స్ గురించే వీరంతా ముచ్చ‌టించుకుంటున్నారా? ఇంత‌కీ అది కార‌వ్యాన్ లో దృశ్య‌మా? అన్న‌ది లైగ‌ర్ టీమ్ వెల్ల‌డించాల్సి ఉంది.

ఆ ఫోటోలో హీరో నిర్మాత సాధార‌ణ దుస్తుల్లోనే క‌నిపిస్తుంటే.. అన‌న్య‌ వైట్ మిడ్డీ స్కర్ట్ హాట్ బ్లౌజ్ లో క‌నిపిస్తోంది. అంటే సీన్ లోకి వెళ్లే ముందు ఇలా ఆ ముగ్గురూ ఓ చోట క‌లిసారా? అయినా లైగ‌ర్ టీమ్ వారాంతాల్లో కూడా సెల‌వు తీసుకోకుండా షూటింగ్ చేసేస్తుండ‌డం చూస్తుంటే ఎంత కసిగా ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు.