VD ఫ్యాన్స్ కి నిరీక్షణ తప్పేలా లేదుగా..!

Tue May 04 2021 16:00:02 GMT+0530 (IST)

Liger Movie Shooting Updates

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ''లైగర్'' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో భారీ షెడ్యూల్ షూట్ కంప్లీట్ చేశారు. అయితే కోవిడ్ ఉదృతి కారణాలతో ఈ సినిమా షూటింగ్ నిలిపివేశారు. దీంతో స్పీడ్ గా సినిమాలు చేసే పూరీ - విజయ్ లకు బ్రేక్స్ పడినట్లయింది. పాన్ ఇండియా లెవల్ రూపొందుతున్న ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టిన వీడీ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. విజయ్ ని సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి 'లైగర్' లేట్ అవుతుండటం అసహనానికి గురి చేస్తోందని తెలుస్తోంది.



'లైగర్' చిత్రాన్ని తెలుగు హిందీ తమిళ  మలయాళ కన్నడ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు కరోనా పరిస్థితులు చూస్తుంటే అప్పటికి షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అవడం కష్టమని టాక్ వినిపిస్తోంది. విజయ్ మాత్రం పరిస్థితులు అనుకూలించి వీలైనంత త్వరగా ఈ సినిమాని కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి. ఇకపోతే ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. రోనీత్ రాయ్ - ఆలీ - విషు రెడ్డి - మకరంద్ దేశ్ పాండే - గెటప్ శీను తదితరులు నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరీ జగన్నాథ్ - ఛార్మీ కౌర్ - కరణ్ జోహార్ కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.