'లైగర్' ప్లానింగ్ మామూలుగా లేదుగా!

Wed Aug 10 2022 12:28:58 GMT+0530 (India Standard Time)

Liger Fandom Tour

టాలీవుడ్ సెన్సేషన్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ 'లైగర్'. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. కరణ్ జోహార్ అపూర్వమోహతా తో కలిసి పూరి చార్మి ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు.అనన్య పాండే హీరోయిన్ గా నటించగా కీలకమైన అతిథి పాత్రల్లో వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ నటించారు. తెలుగుతో పాటు హింధీలోనూ ఏక కాలంలో రూపొందిన ఈ సినిమాని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

సినిమా రిలీజ్ కు దాదాపు నెల రోజుల ముందే 'లైగర్' టీమ్ ప్రమోషన్స్ ని ప్రారంభించేసింది. ఈ మూవీతో హీరో విజయ్ దేవరకొండ నేరుగా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కానున్న నేపథ్యంలో ప్రత్యేకంగా నార్త్ ప్రేక్షకులపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా నేవి ముంబైతో పాట ఇటీవల పల ఏరియాల్లోని షాపింగ్ మాల్స్ లో ప్రత్యేకంగా ఈవెంట్ లని నిర్వహించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇటీవల పాట్నాకు ప్రత్యేకంగా వెళ్లిన విజయ్ దేవరకొండ అక్కడి వీధుల్లో ఫ్యాన్స్ ని ప్రత్యేకంగా కలుసుకున్నారు.

ముంబై పాట్నా ఏరియాలలో ఫ్యాన్స్ స్టూడెంట్స్ నుంచి భారీ స్పందన లబించడంతో అదే తరహాలో దేశంలోని ప్రధాన పట్టణాల్లో పర్యటించాలని 'లైగర్' టీమ్ ప్రత్యేకంగా టూర్ ప్లాన్ చేసింది. 'ఫ్యాన్ డమ్ టూర్' పేరుతో ప్రత్యేకంగా ప్లాన్ చేసిన ఈ ప్రమోషనల్ టూర్ ఆగస్టు 11న పూనేలో మొదలై ఆగస్ట 23న వారణాసిలో ఎండ్ కాబోతోంది. ఈ టూర్ లో యావత్ ఇండియా మొత్తం విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే పర్యటించనున్నారు.

టూర్ వివరాలు ఇలా వున్నాయి. ఆగస్టు 11న పూనే 12న చండీఘర్ 13న చెన్నై 14న వరంగల్ 15న హైదరాబాద్ 17న ఇండోర్ 18న కొచ్చీ (కేరళ) 19న బెంగళూర్ 20న గుంటూర్ 21ర ఢిల్లీ 23న వారణాసిలలో పర్యటించి హంగామా చేయబోతున్నారు.

ఇటీవల విడుదలైన సినిమాలు చెప్పుకోదగ్గ విజయాల్ని అందించలేకపోవడంతో విజయ్ దేవరకొండ 'లైగర్'పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లో తన భావిత్యవం కూడా ఆధారపడి వుండటంతో 'లైగర్' విజయ్ దేవరకొండ కెరీర్ కి కీలకంగా మారింది.