అల్లు ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేసిన లైగర్ బ్యూటీ

Wed Aug 17 2022 08:00:02 GMT+0530 (India Standard Time)

Liger Beauty attracts Allu fans

బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ అనన్య పాండే తెలుగులో కూడా సినిమాలు చేయాలి అని బాగానే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తోంది. మొదట ఈ బ్యూటీకి లైగర్ సినిమాతో మంచి అవకాశం అయితే లభించింది అని చెప్పవచ్చు. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై నార్త్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయితే కనుక అనన్య పాండేకు సౌత్లో కూడా మంచి డిమాండ్ అయితే ఏర్పడుతుంది.ఇక ఈ బ్యూటీ తెలుగు వారికి బాగా దగ్గర అవ్వాలని చూస్తున్నట్లు కాకూడదు అర్థమవుతుంది. ఇటీవల వరంగల్ ఈవెంట్ లో ఆమె తెలుగులో మాట్లాడి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఫ్యాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలి కాబట్టి ఈ బ్యూటీ మార్కెట్ కు తగ్గట్టుగానే వ్యవహరిస్తూ ఉండడం విశేషం.

ఇక తెలుగులో మాట్లాడడమే కాకుండా ఈ బ్యూటీ పలు ఇంటర్వ్యూలలో ఇక్కడి స్టార్ హీరోలపై కూడా పాజిటివ్ గా స్పందిస్తూ ఉండడంతో వర్గం అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.

ముఖ్యంగా పుష్ప సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ పై కూడా ఈ బ్యూటీ ఒక చిన్న కామెంట్ చేసి ఎంతగానో అట్రాక్ట్ అయితే చేసింది. తనకు అల్లు అర్జున్ చాలా అంటే చాలా ఇష్టం అంటూ అతని డ్యాన్స్ తో పాటు యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా ఇష్టమని తెలియజేసింది. ముఖ్యంగా అల వైకుంఠపురములో సినిమాను చాలా సార్లు చూశాను అని ఆయనతో నటించాలని ఉంది అన్నట్లుగా కూడా తెలియజేసింది.

ఇక హీరోయిన్స్ లలో అయితే ఆలియా భట్ తన డ్రీమ్ రోల్ అంటూ వివరణ ఇచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ పేరు చెప్పడంతో ఈ బ్యూటీకి ఆ హీరో అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. మరి రాబోయే రోజుల్లో అనన్య పాండే ఐకాన్ స్టార్ తో అవకాశం అందుకుంటుందో లేదో చూడాలి.

ఇక లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి ఓపెనింగ్స్ అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  అనన్య పాండే ఈ సినిమాతో పాటు త్వరలోనే మరో కొత్త సినిమాతో కూడా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.