'లైగర్' బ్యూటీ కాపీ క్యాట్..క్యా హై పాండే!

Sun May 29 2022 08:00:01 GMT+0530 (IST)

'Liger' Beauty Copy Cat.. Pandey!

కాపీ కొట్టడం కూడా ఓ ఆర్ట్. మక్కీకి మక్కీ దించేయడం ఓ ఎత్తేతే. కొద్దిపాటి మార్పులతో లిప్ట్ చేయడం మరో ఎత్తు. కొంత మంది కాపీకి అనుకరణ అని పేరు పెడతారు. ట్రోలర్స్ ఎటాక్ చేస్తారని భావిస్తే ముందుగానే ఫలానా వాళ్లు స్పూర్తి అనో..మరోకటి అనో చెప్పి మ్యానేజ్ చేస్తుంటారు. ఇలా చెప్పకపోగా దొరికిపోతే మాత్రం అడ్డంగా బలైనట్లే.ట్రోలర్స్ ఊరికనే వదిలిపెట్టరు. తమదైన శైలిలో ఆడేసుకోరు. సరిగ్గా  'లైగర్' బ్యూటీ అనన్య పాండే అదే ఫేజ్ లో ఉందిప్పుడు. ఇటీవలే దర్శ-నిర్మాత కరణ్ జోహార్ 50వ బర్త్ డే బాష్ ఎంత  ఘనంగా జరిగిందో తెలిసిందే. కరణ్ పార్టీకి బాలీవుడ్ అంతా దిగొచ్చింది. టాలీవుడ్ నుంచి   కొంత మంది హాజరయ్యారు.

సాధారణంగా ఇలాంటి పార్టీల్లో హైలైట్ అయ్యేది హీరోయిన్లే. డిజైనర్ దుస్తుల్లో అందంగా ముస్తాబై అందరికన్నా ప్రత్యేకంగా ఫోకస్ అవ్వాలని చూస్తారు. కొన్ని కొన్నిసార్లు అలాంటి అటెంప్ట్  లు బెడిసి కొట్టిన సంరద్భాలు ఉన్నాయి. రష్మిక మందన్న డిజైనర్ దుస్తుల్లో పార్టీకి  హాజరై ఎంత ఇబ్బంది పడిందో తెలిసిందే.

ఇప్పటివరకూ ఎప్పుడూ మెరవని స్లివ్ లెస్ దుస్తుల్లో మెరుపులు వరకూ బాగానే ఉన్నాయి..కానీ థై షోస్ పాకులాటకు పోయి ఆ డ్రెస్ లో ఎంతో అసౌకర్యవంతంగా ఫీలైంది. ఇదే పార్టీకి అన్య పాండే కూడా డిజైనర్ దుస్తుల్లో మిరుమిట్లు గొలిపింది. వైట్ షైన్ కలర్ డిజైనర్ లో పాండే వావ్ అనిపించింది. కానీ  ఆతర్వాతే అర్ధమైంది.

అమ్మడు ఓ హాలీవుడ్ నటి డిజైనర్ ని కాపీ కొట్టిందని. ఇంగ్లీష్ నటి కెండల్ జెన్నర్ గతంలో ఇదే మోడల్ డ్రెస్ లో మెరిసింది. ఇప్పుడు ఆ రెండు ఫోటులు పక్కపక్కన పెట్టి చూస్తే అనన్య పాండే కాపీ కొట్టిందని తేలిపోయింది. టాప్ టూ బాటమ్ ఒకే డిజైన్ కలిగి ఉంది. నెక్ వద్ద మాత్రమే చిన్న పాటి మార్పులున్నాయి తప్ప మిగతాదంతా సేమ్ టూ సేమ్.

దీంతో పార్టీకి హాజరైన కోనటులంతా ఈ డ్రెస్ ఎక్కడో చూసినట్లు ఉందని ముచ్చటించుకోవడం ఆసక్తికరం. నెటి జనులు హాలీవు్డ్  నటి పాత ఫోటోల్ని తీసి..అనన్య భరతం పట్టే పనిలో పడ్డారు. పాపం అనన్య ఇలా ఎవరో చేసిన తప్పుకి తాను  అడ్డంగా  బుక్కైంది. ఆ తప్పు చేసింది ఎవరో కాదు. అన్యన్య డిజైనర్ అయి ఉంటారు. ఏ పార్టీకి ఏ డ్రెస్ చూజ్ చేసుకోవాలన్నది డిజైనర్ పైనే  ఆధారపడి ఉంటుంది. వాళ్ల సూచించిన విధంగానే హీరోయిన్లు ఫాలో అవుతుంటారు. అప్పుడప్పుడు ఇలా అనుకోకుండా దొరికిపోతుంటారు.

అనన్య పాండే  'లైగర్' తో టాలీవుడ్ కి పరిచయమవుతోన్న సంగతి  తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తుంది. పూరి జగన్నాధ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూరి కనెక్స్ట్  భాగస్వామ్యంలో బాలీవుడ్ నిర్మాత  కరణ్ జోహార్ కూడా చేరారు. అలా కరణ్ కి పూరి టీమ్ అంతా ఇంతలా క్లోజ్ అయిందన్న మాట.