Begin typing your search above and press return to search.

'లెహరాయి' సాంగ్ ప్రోమో: అఖిల్ - పూజాహెగ్డే మధ్య రొమాన్స్ అదిరిపోయిందిగా..!

By:  Tupaki Desk   |   13 Sep 2021 12:30 PM GMT
లెహరాయి సాంగ్ ప్రోమో: అఖిల్ - పూజాహెగ్డే మధ్య రొమాన్స్ అదిరిపోయిందిగా..!
X
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని - పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్''. ఈ యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 8న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టిన చిత్ర బృందం.. 'లెహరాయి' అనే సాంగ్ ప్రోమోని విడుదల చేశారు.

'లెహరాయి లెహరాయి.. గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి.. ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి.. కళ్ళలోన దాగి ఉన్న అమ్మాయి.. సొంతమల్లె చేరుతుంటే..' అంటూ సాగిన ఈ రొమాంటిక్ ప్రోమో అలరిస్తోంది. గోపీ సుందర్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ కు శ్రీమణి సాహిత్యం అందించారు. యువ గాయకుడు సిద్ శ్రీరామ్ తనదైన శైలిలో ఈ గీతాన్ని అద్భుతంగా ఆలపించారు. ఇందులో అఖిల్ - పూజా హెగ్డే జంట బెడ్ మీద ముద్దులు పెట్టుకుంటూ.. రొమాన్స్ తో అదరగొట్టాడు.

'లెహరాయి' ఫుల్ సాంగ్ ను సెప్టెంబర్ 15న ఉదయం 11.30 గంటలకు విడుదల కానుంది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి వస్తుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ - పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ గా లవ్ లీగా డిజైన్ చేసే దర్శకుడు భాస్కర్.. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేసారని తెలుస్తోంది.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోంది. బన్నీ వాస్ - వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆమని - ఈషా రెబ్బా - చిన్మయి - వెన్నెల కిషోర్ - మురళీశర్మ - జయప్రకాష్ - ప్రగతి - అమిత్ తివారి - సుడిగాలి సుధీర్ - గెటప్ శ్రీను - అభయ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ప్రదీశ్ వర్మ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్ గా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.