భీమల్ నాయక్ కోసం దిగ్గజ సినిమాటోగ్రాఫర్

Thu Jul 29 2021 17:00:01 GMT+0530 (IST)

Legendary cinematographer for Bheemla Naik

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - టాలీవుడ్ హంక్ రానా కథానాయకులుగా యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ సాగర్.కె.చంద్ర ఓ చిత్రాన్ని తెరక్కించనున్న సంగతి తెలిసిందే. `భీమల్ నాయక్` అనేది టైటిల్. `అయ్యారే`.. `అప్పట్లో ఒకడుండేవాడు` వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సాంగర్ చంద్ర తనదైన శైలి కంటెంట్ తో ఆన్ సెట్స్ కు వెళ్లబోతున్నారు. పవన్ లో రియల్ క్వాలిటీస్ ని సైతం సాగర్ చంద్ర తట్టిలేపనున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ చిత్రానికి సాగర్ చంద్ర ఫస్ట్ క్లాస్ టెక్నీషియన్లని ఎంపిక చేసే పనిలోనూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఛాయాగ్రాహకుడిగా ప్రసాద్ మూరెళ్లను ఎంపిక చేసారు. కానీ ఆయన అనివార్య కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని రవి కె. చంద్రన్ తో ఫుల్ ఫిల్ చేస్తున్నట్లు తెలిసింది. అధికారికంగాను ఆ విషయాన్ని రవి కె. చంద్రన్ ఫైనల్ చేసారు. ఓ మేకింగ్ వీడియోతో కొత్త జర్నీ ప్రారంభమైనట్లు ట్వీట్ చేసి చెప్పారు. రవి కె. చంద్రన్ చాలా సీనియర్ సినిమాటోగ్రాఫర్. చాలా మలయాళ సినిమాలకు పనిచేసారు. మోహన్ లాల్-మమ్ముట్టి లాంటి టాప్ స్టార్ల సినిమాలకు పనిచేసారు. అలాగే పలు బాలీవుడ్ సినిమలకు తన కెమెరా పనితనం చూపించారు. టాలీవుడ్ లో `భరత్ అనే నేను` చిత్రంతో అడుగు పెట్టారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు..రవి. కె. చంద్రన్ పనితనాన్ని మంచి ప్రశంసలు దక్కాయి.

తాజాగా మరోసారి పవర్ స్టార్ సినిమాతో మళ్లీ కంబ్యాక్ అవుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. స్క్రిప్టుకి తగ్గ నటీనటుల కోసం టీమ్ వెతుకుతోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది.