Begin typing your search above and press return to search.

లెజెండరీ నటుడి మనవడు హీరోగా ఎంట్రీ

By:  Tupaki Desk   |   22 May 2022 11:30 AM GMT
లెజెండరీ నటుడి మనవడు హీరోగా ఎంట్రీ
X
బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ప‌రిశ్ర‌మ ఏదైనా న‌టవార‌సుల వెల్లువ కొన‌సాగుతూనే ఉంది. ఇప్పుడు దివంగత కోలీవుడ్ నటుడు నడిగర్ తిలగం శివాజీ గణేశన్ కుటుంబం నుంచి మరో యువ‌కుడు హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడు. లెజెండ్ మనవడు ద‌ర్శ‌న్ గణేశన్ హీరోగా నిరూపించుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇతను శివాజీ గణేశన్ కొడుకు రామ్ కుమార్ చిన్న కొడుకు. ధరన్ సోదరుడు దుశ్యంత్ కోలీవుడ్ లో నిర్మాత గా నటుడిగా సుప‌రిచితం.

ప్రస్తుతానికి ఈ సినిమాపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ధరన్ ఇప్పటికే పూణెలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. డెబ్యూతో ప‌ని చేస్తున్న చిత్ర‌బృందం ఎవ‌రు? ద‌ర్శ‌కుడు ఎవ‌రు.. క‌థానాయిక ఎవ‌రు వ‌గైరా వ‌గైరా వివ‌రాలు తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

శివాజీ గ‌ణేష‌న్ చరిత్ర అన‌న్య‌సామాన్యం

శివాజీ గణేషన్ ను దక్షిణ భారతదేశానికి చెందిన మార్లన్ బ్రాండోగా అభిమానులు అభివ‌ర్ణిస్తుంటారు. అనేక అవార్డులు గెలుచుకున్న శివాజీని భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక లెజెండ్ గా కీర్తించ‌బ‌డ్డారు. నేటి స్క్రీన్ ప్రెజెన్స్ కి ఒక మైలురాయిని నిర్దేశించిన నటుడు శివాజీ గణేశణ్‌.. సినిమా జీవించి ఉన్నంత కాలం న‌డిగర్ తిలగం చిత్రాలు తమిళ ప్రజల హృదయాల్లో గుర్తుండిపోతాయి.

తన అభిమానులు నడిగర్ తిలగం అని ప్రేమగా పిలిచే శివాజీ గణేషన్ దాదాపు ఐదు దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమను పరిపాలించారు. తమిళం- తెలుగు- కన్నడ- మలయాళ- హిందీ చిత్ర పరిశ్రమల్లో దాదాపు 288 చిత్రాల్లో నటించారు. 1960 లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో (ఆఫ్రో-ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్) ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ చిత్ర వ్యక్తిగా శివాజీ గణేశన్ నిలిచారు. ఐదు దశాబ్దాల కెరీర్ లో శివాజీ గణేషన్ ఎన్నో గొప్ప అవార్డులు రివార్డులు అందుకున్నారు. జాతీయ అవార్డు స‌హా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడిగా ఆయన పలువురు దక్షిణ భారత సినీ నటులకు స్ఫూర్తినిచ్చారు. మేటి న‌టుడిగా భ‌విష్య‌త్ సినీప్ర‌పంచానికి ఎన్నో కొత్త దారుల‌ను ఆవిష్క‌రంచారు. ఒక్క తమిళ భాషలోనే 275 చిత్రాల్లో నటించిన ఆయ‌న తెలుగు స‌హా ఇతర భాషల్లోనూ అద్భుతమైన పాత్రలో నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచారు.

2001 జూలై 22 ఆయ‌న నిష్క్ర‌మ‌ణం సినీప్ర‌పంచానికి పెద్ద షాక్ నిచ్చింది. శివాజీ గణేషన్‌ పెద్ద కుమారుడు రామ్ కుమార్ ... రెండవకొడుకు నటుడు ప్రభు.. మనవడు విక్రమ్‌ ప్రభు సినీరంగంలోనే ఉన్నారు. తెలుగు చిత్ర‌సీమ‌లో లెజెండ‌రీ న‌టులు ఏఎన్నార్ .. ఎన్టీఆర్ .. చిరంజీవి వంటి ప్ర‌ముఖులు శివాజీగ‌ణేషన్ ని న‌టుడిగా ఎంతో ఆరాధిస్తార‌న్న సంగ‌తి తెలిసిన‌దే. ద‌ర్శ‌క‌ర‌త్న కీ.శే డా.దాస‌రి నారాయ‌ణ‌రావు ఆయ‌న న‌ట‌న‌కు వీరాభిమాని. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ లెజెండ‌రీ శివాజీగ‌ణేష‌న్ స్ఫూర్తితో న‌ట‌రంగంలో ఎదిగాన‌ని చెబుతారు.