ఓటీటీ వరల్డ్ లో అడుగు పెట్టబోతున్న ప్రముఖ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కంపెనీ...?

Sun Jul 12 2020 19:20:00 GMT+0530 (IST)

Leading infrastructure company about to set foot in OTT World ...?

డిజిటల్ వరల్డ్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఓటీటీ.. అంటే 'ఓవర్ ది టాప్'. ఒకప్పుడు కొత్త సినిమాలు చూడాలంటే థియేటర్స్ కి వెళ్లేవారు. ఇప్పుడు కొత్త సినిమాలు ఇంట్లోనే కూర్చొని తమ పర్సనల్ స్క్రీన్ మీద ఓటీటీలలో చూసేస్తున్నారు. వీటితో పాటు వెబ్ సిరీస్ లు మరియు ఒరిజినల్ మూవీస్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న పరిస్థితుల వలన థియేటర్స్ లో సినిమా విడుదలై చాలా రోజులైపోయింది. ఒకవేళ రాబోయే రెండు నెలల్లో థియేటర్స్ ఓపెన్ చేసినా ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్స్ కి వస్తారా అనేదీ అనుమానమే. దీన్ని డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మేకర్స్ కూడా వెబ్ కంటెంట్ ని తీసి ఓటీటీలలో రిలీజ్ చేస్తే ఆదరణ లభిస్తుందనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టేసాడు. ఈ క్రమంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారెడ్డి అల్లుడు కూడా ఓటీటీ స్టార్ట్ చేసే ఆలోచన చేస్తున్నారట.కాగా మేఘా ఇన్ఫ్రా స్ట్రక్చర్ వారు 'మై హోమ్' గ్రూపు వారితో కలిసి ఇప్పటికే మీడియా రంగంలో పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలో 'మై హోమ్' గ్రూపు వారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' ని క్రియేట్ చేశారు. అయితే మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు మాత్రం ఈ ఓటీటీలో పెట్టుబడులు పెట్టలేదు. అయితే ఇప్పుడు మేఘా వారు కూడా వెబ్ వరల్డ్ లో అడుగులు వేస్తున్నారట. అందుకోసం సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారట. దీని కోసం ఇప్పటికే మేఘా కృష్ణారెడ్డి అల్లుడు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టేసారట. సీనియర్ నటుడు రాజారవీంద్ర ఈ ఓటీటీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని సమాచారం. ఇప్పటికే రాజారవీంద్ర త్వరలో ప్రారంభం కాబోయే ఓటీటీకి వెబ్ కంటెంట్ రైటర్స్ డైరెక్టర్లు కావాలని ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం మీద రాబోయే రోజుల్లో ఓటీటీలదే రాజ్యం కాబోతోందని భావిస్తున్న ప్రముఖులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని అర్థం అవుతోంది.