ప్రముఖ కథానాయిక రెండు నెలల గర్భిణి..?

Fri May 13 2022 09:00:02 GMT+0530 (IST)

Leading heroine two months pregnant

అవును.. ప్రముఖ కథానాయిక రెండు నెలల గర్భిణి అని తెలిసింది. సదరు కథానాయిక ఇటీవలే ఓ యువకథానాయకుడిని పెళ్లాడింది. అతడితో గత రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ బ్యూటీ ఇటీవలే పెళ్లాడి లైఫ్ లో సెటిలైంది. ఇకపోతే పెళ్లి భాజా మోగి రెండు నెలలే అయ్యింది. ఇంతలోనే తను రెండు నెలల గర్భిణి అన్నపుకార్ షికార్ చేస్తోంది.ఆ మేరకు ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్ రాసిన కథనం క్షణాల్లో వైరల్ అయ్యింది. అయితే ఇంతలోనే ఆ వార్తను సైట్ నుంచి తొలగించారు. బహుశా ఇది కేవలం గాసిప్ మాత్రమేనా?  అధికారికంగా ప్రకటించే వరకూ వేచి చూడాల్సిందిగా సదరు కథానాయిక కోరిందా? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఏది ఏమైనా సదరు ప్రేమపక్షులు కొంతకాలంగా సహజీవనంలో ఉన్న తర్వాతే పెళ్లి చేసుకున్నారు. అందువల్ల ఇలాంటి పుకార్లు సహజం. తొందరపడి ఒక కోయిల ముందే కూయడం నేరం! అధికారికంగా ఈ జంట ప్రకటించేవరకూ ఇది నిజం అని నమ్మలేం. బాలీవుడ్ లో సుదీర్ఘ కాలం ప్రేమాయణాల తర్వాత లైఫ్ లో సెటిలైన బ్యూటీగా ఈ అమ్మడికి గుర్తింపు ఉంది. యువహీరోతో ప్రేమలో పడడమే గాక తాను అనుకున్నది సాధించుకుంది. ఇకపై లైఫ్ లో మరో అంచును తాకే ప్రయత్నంలో ఉంది. ఈ జంట అన్యోన్యత ఇటీవలి కాలంలో హాట్ టాపిక్ గా మారింది.