'మా నీళ్ల ట్యాంక్'తో లీడర్ బ్యూటీ రీ ఎంట్రీ

Thu Jul 07 2022 06:00:01 GMT+0530 (IST)

Leader beauty re entry with Maa Neella Tank

శేఖర్ కమ్ముల.. రానా దగ్గుబాటి కాంబినేషన్లో కొన్నాళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్ ను దక్కించుకున్న లీడర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రియా ఆనంద్. లీడర్ సినిమాలో అందం తో పాటు అభినయంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు లో పలు సినిమాల్లో నటించింది. అందులో కొన్ని నిరాశ పర్చగా కొన్ని పర్వాలేదు అనిపించాయి.కొన్ని కారణాల వల్ల తెలుగు ప్రేక్షకులకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న ప్రియా ఆనంద్ రీ ఎంట్రీకి సిద్దం అయ్యింది. వరుడు కావలెను సినిమా తో మంచి పేరు దక్కించుకున్న దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తాజాగా `మా నీళ్ల ట్యాంక్` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కించింది. ఆ వెబ్ సిరీస్ లో ప్రియా ఆనంద్ నటించింది.

ఒక చిన్న గ్రామంలో పనికి రాని వాటర్ ట్యాంక్ చుట్టూ నడిచే కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ జీ5 సంస్థ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ లో అక్కినేని హీరో సుశాంత్ సబ్ ఇన్ స్పెక్టర్‌గా కనిపించబోతున్నాడు. పల్లెటూరి అమ్మాయిగా పాత్రలో ప్రియా ఆనంద్ కనిపిస్తోంది.

ఎనిమిది ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ వెబ్ సీరిస్ ని జూలై 15 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్ కోసం ప్రియా సొంతంగా డబ్బింగ్ చెప్పింది. ఈ టీజర్లో ప్రియా ఆనంద్ నటన ను ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె కుమార్ ప్రశంసించారు.

తెలుగు ప్రేక్షకులకు చాలా కాలంగా దూరంగా ఉంటున్న ప్రియా ఆనంద్ ఈ వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చి సినిమా ల్లో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఈ లీడర్ బ్యూటీకి సినిమా ల్లో ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి.