పిక్ టాక్ : వైరల్ అవుతున్న లయ కూతురు

Mon Sep 26 2022 10:45:43 GMT+0530 (India Standard Time)

Laya's daughter goes viral

స్వయంవరం సినిమా తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న లయ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. తెలుగు అమ్మాయి అవ్వడంతో లయ కి ఎక్కువగా ప్రాముఖ్యత దక్కలేదు. తనకు మంచి ఆఫర్లు వచ్చినంత కాలం సినిమాలు చేసిన లయ ఆఫర్లు తగ్గిన వెంటనే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి పోయింది. అక్కడ వైవాహిక జీవితంలో ఇన్నాళ్లు బిజీగా ఉన్న లయ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.పిల్లల పెద్ద వారు అవ్వడంతో వారి యొక్క బాధ్యత తగ్గడంతో లయ సోషల్ మీడియా ద్వారా సందడి మొదలు పెట్టింది. ఆమె రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్న కారణంగా నటిగా మళ్లీ రీ ఎంట్రీకి ఆసక్తిగా ఉన్నట్లుగా ప్రచారం మొదలు అయ్యింది. లయ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సమయంలోనే లయ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లయ తన కూతురు ఫోటోను డాటర్స్ డే సందర్భంగా షేర్ చేసింది. లయ కూతురు ను ఈ మధ్య కాలంలో షేర్ చేయడం ఇదే ప్రథమం. ఒక్కసారిగా లయ అంత ఎత్తు ఉన్న ఆమె కూతురుని చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. లయకి ఇంత ఎత్తు పాప ఉందా అంటూ చాలా మంది నోరు వెళ్లబెడుతున్నారు.

లయ షేర్ చేసిన ఈ ఫోటోను చూసి చాలా మంది త్వరలోనే లయ టాలీవుడ్ రీ ఎంట్రీ ఏమో కానీ ఆమె కూతురు ను హీరోయిన్ గా తీసుకుని రావాలని కోరుకుంటున్నారు. లయ కూతురు అచ్చు అమ్మ పోలికతో చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

లయ కంటే కూడా మరింత అందంగా పాప ఉందని.. మంచి హైట్ మరియు ఫిజిక్ ఉన్న ఈ పాప ను వెండి తెరపై చూపించాలంటూ లయకు వేల మంది రిక్వెస్ట్ ను కామెంట్స్ రూపంలో షేర్ చేస్తున్నారు. మరి లయ ఆలోచన ఏంటో.. ఇంతకు ఆ పాపకు ఇంట్రెస్ట్ ఉందో లేదో కాలమే నిర్ణయించాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.