ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టిన 'టాలీవుడ్ రత్తాలు'...!

Sun May 24 2020 20:00:01 GMT+0530 (IST)

Laxmi Raai Workouts

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన సినీ సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఖాళీగా ఉండటంతో టైంపాస్ కోసం రకరకాల పనులు చేస్తున్నారు. కొందరు హీరోయిన్స్ ఎప్పటిలాగే తమ ఫిట్నెస్ కాపాడుకోవడం కోసం వర్కౌట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ రత్తాలు రాయ్ లక్ష్మీ కూడా డైలీ వర్కౌట్స్ చేస్తూ తన ఫిజిక్ ని కాపాడుకుంటోంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు ఇలాంటి వర్కౌట్స్ చేస్తూ సన్నబడింది. సౌత్ సినీ అభిమానులకు రాయ్ లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆమె కెరీర్ లో హీరోయిన్ గా అనుకున్నంతగా అవకాశాలు అందుకోకపోయినప్పటికి ఆమె గ్లామర్ వల్ల బాగా క్రేజ్ తెచ్చుకుంది. 'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో తెలుగులో పరిచయమైన 'లక్ష్మీరాయ్' ఇప్పుడు 'రాయ్ లక్ష్మీ'గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన ఈ భామ అక్కడ తన అందచందాలతో అవకాశాలను బాగానే సొంతం చేసుకుంది. ఆమె నటించిన పలు సినిమాలో తెలుగులోకి అనువాదమై మంచి ఫలితాలు కూడా పొందాయి. తెలుగులో మాత్రం ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఇక్కడి ప్రేక్షకులను అలరించింది.రాయ్ లక్ష్మీ 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమాలో 'తోబ తోబా' సాంగ్ లో కాలు కదిపింది. అంతేకాకుండా మెగాస్టార్ రీఎంట్రీ సినిమా 'ఖైదీ 150'లో 'రత్తాలు రత్తాలు' పాటకి స్టెప్పేసింది. దీంతో టాలీవుడ్ రత్తాలుగా మారిపోయింది రాయ్ లక్ష్మీ. అమ్మడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి 'జూలీ 2' సినిమాతో తన అందాలను ప్రదర్శించింది. అయితే అక్కడా అమ్మడికి లక్ కలిసి రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత మలయాళంలోకి అడుగుపెట్టి అక్కడ కూడా తన లక్ పరీక్షించుకుంది. మొత్తం మీద అన్ని ఇండస్ట్రీలలో అడుగుపెట్టిన రత్తాలు ఎక్కడా స్టార్ హీరోయిన్ గా మారలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే రాయ్ లక్ష్మి ఎలాంటి ఫోటో షేర్ చేసినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోసి నెటిజన్స్ మతులుపోగొట్టేస్తోంది. ఇప్పుడు లేటెస్టుగా తన వర్కౌట్ వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది. ఎన్ని రకాల వర్కౌట్స్ ఉంటాయో అన్నిటిని చేసేస్తోంది. అమ్మడు గ్లామర్ సీక్రెట్ ఇదేనేమో మరి. ఇదిలా ఉండగా రాయ్ లక్ష్మీ గతేడాది 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' సినిమాతో టాలీవుడ్ ని పలకరించింది. ప్రస్తుతం కోలీవుడ్ లో రెండు సినిమాలు లైన్లో పెట్టిన ఈ భామ తెలుగులో 'ఆనంద భైరవి' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతోనైనా టాలీవుడ్ లో మంచి అవకాశాలు దక్కించుకోవాలని రాయ్ లక్ష్మీ అభిమానులు కోరుకుంటున్నారు.