జిమ్ లో లావణ్యం జిగేల్ జిగేల్

Mon Aug 03 2020 10:00:03 GMT+0530 (IST)

Lavanya Tripathi Latest Pose In Gym

నేటి తరం జిమ్ యోగా విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. కోవిడ్ నియమనిబంధనల ప్రకారం ఆరోగ్యానికి ప్రాధాన్యత పెరిగింది. రోగ నిరోధక శక్తి కలిగి నిండు జీవితం ఆరోగ్యంగా ఉండాలంటే జిమ్ చేయాల్సిందే. యోగా- ధ్యానం తప్పనిసరి అయ్యింది. అయితే కోవిడ్ వల్ల ఇన్నాళ్లు జిమ్ లు ఏవీ తెరవకపోవడంతో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఏం చేసిందో తెలుసా?తన ఇంటి టెర్రాస్ పైనే సొంతంగా ఓ చిన్నపాటి జిమ్ ని సెట్ చేసుకుంది. అక్కడ తన సోదరితో కలిసి నిరంతరం జిమ్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలు.. ఫోటోలు షేర్ చేస్తోంది. ఇక లావణ్యకు తన పెట్ డాగ్ కోచ్ గా మారి శిక్షణ ఇస్తున్న వీడియోని ఇంతకుముందు సోషల్ మీడియాల్లో షేర్ చేస్తే అది కాస్తా యూత్ లో వైరల్ అయ్యింది.

తాజాగా ఔట్ సైడ్ ఓ భారీ జిమ్ నుంచి లావణ్య ఇచ్చిన ఫోజు వైరల్ గా మారింది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ ఆగస్టు నుంచి జిమ్ లు తెరుచుకునేందుకు కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో జిమ్ కి వెళ్లినట్టుంది లావణ్య. అక్కడి నుంచే ఇవిగో ఇలా ఫోటోలు తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇటీవల ఇంటి మేడ పైనే జిమ్ చేసినా ఎక్కడా రూపలావణ్యం చెక్కు చెదరలేదు. సన్నజాజి తీగలాగా ఆ నడుమును బాగానే మెయింటెయిన్ చేస్తోంది. పొట్ట దిగువన మాత్రం కాస్తంత కొలెస్టరాల్ కంట్రోల్ కాలేదని ఫోటో చూస్తే అర్థమవుతోంది. మరి అది కాస్తా ఇక కరిగించే టైమొచ్చినట్టే ఉంది. అన్నట్టు లావణ్యకు ఇటీవల ఆశించినన్ని హిట్లు దక్కలేదు. ఆఫర్లు అసలే లేవు. అందుకే ఇలా శ్రమిస్తోందేమో!