Begin typing your search above and press return to search.

పెళ్లి పుకార్ల పై ఫోటోలతో క్లారిటీ ఇస్తోందా..?

By:  Tupaki Desk   |   21 Jan 2022 2:52 AM GMT
పెళ్లి పుకార్ల పై ఫోటోలతో క్లారిటీ ఇస్తోందా..?
X
‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి మెగా హీరోతో ప్రేమాయణం సాగిస్తోందంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అది కూడా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో అని నెట్టింట రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. బుధవారం వరుణ్ పుట్టినరోజు కావడంతో లావణ్యతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి బెంగళూరు వెళ్లారని.. ఆమె కోసం అత్యంత ఖరీదైన డైమండ్ రింగ్ ని కొనుగోలు చేశారని వార్తలు పుట్టుకొచ్చాయి. పెళ్లి పుకార్లపై నిశ్శబ్దంగా ఉన్న లావణ్య.. ఫొటోలతో వాటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.

మెగా హీరోతో పెళ్లి అనే రూమర్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో లావణ్య త్రిపాఠి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ప్రకృతి అందాలు తన మనసుని కట్టిపడేస్తున్నాయని పేర్కొన్న ఈ బ్యూటీ.. డెహ్రాడూన్ లో ఉన్నట్లు లొకేషన్ ను ట్యాగ్ చేసింది. తాను బెంగుళూరులో లేనని.. తన స్వస్థలంలో ఫ్యామిలీతో ఉన్నట్లు చెప్పకనే చెప్పినట్లు.. ఈ విధంగా రూమర్స్ కు చెక్ పెడుతోందని అనుకోవచ్చు.

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంటగా 'మిస్టర్' 'అంతరిక్షం' వంటి చిత్రాల్లో నటించారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అలరించిన వీళ్లిద్దరూ.. ఆఫ్ స్క్రీన్ లోనూ సన్నిహితంగా మెలగడంతో ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి కి లావణ్య హాజరవడం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. ఇప్పుడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా బెంగుళూరు వెళ్లడంతో మరోసారి ఈ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. మరి ఇవి లావణ్య త్రిపాఠి చెవిన పడ్డాయేమో పరోక్షంగా తాను బెంగుళూర్ లో లేనని ఫొటోలతో క్లారిటీ ఇచ్చింది.