Begin typing your search above and press return to search.

అందాల రాక్షసి బర్త్‌ డే పార్టీ ముహూర్తం ఫిక్స్

By:  Tupaki Desk   |   25 Jun 2022 5:57 AM GMT
అందాల రాక్షసి బర్త్‌ డే పార్టీ ముహూర్తం ఫిక్స్
X
మైత్రి మూవీ మేకర్స్ వారు ఈమద్య కాలంలో భారీ సినిమాలను స్టార్‌ హీరోలతో తెరకెక్కిస్తూ టాలీవుడ్‌ లోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో చిన్న సినిమాలను కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే హ్యాపీ బర్త్‌డే అనే పాన్ ఇండియా సినిమాను నిర్మించారు.

లావణ్య త్రిపాఠి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మొత్తం పార్టీ మూడ్‌ లో ఉంటుందని పోస్టర్స్ మరియు టీజర్‌ ను చూస్తుంటే అర్థం అవుతుంది. అంతే కాకుండా ఈ సినిమా లో గన్ కల్చర్‌ ఎక్కువ అయితే ఏం జరుగుతుంది అనేది కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా ఇటీవల విడుదల అయిన ట్రైలర్ ను చూస్తుంటే అర్ధం అవుతుంది.

ఈ సినిమా విడుదల తేదీ విషయంలో నిన్న మొన్నటి వరకు కాస్త గందరగోళం ఉంది. తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు హ్యాపీ బర్త్‌ డే సినిమా యొక్క విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఫస్ట్‌ కాపీ రెడీ అయ్యి విడుదలకు రెడీగా ఉన్న ఈ సినిమా ను ఎక్కువ ఆలస్యం చేయకుండా జూలై 8వ తారీకున విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

మొదట హ్యాపీ బర్త్‌ డే సినిమా ను కాస్త ఆలస్యంగా విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఇటీవల ఒక సినిమా ను జూలై 8వ తారీకున విడుదల చేయాలనుకుని మళ్లీ ఆ సినిమా వాయిదా పడింది. దాంతో వెంటనే అందాల రాక్షసి యొక్క హ్యాపీ బర్త్‌ డే పార్టీ కి మైత్రి మూవీస్ వారు రెడీ అయ్యారు. ఈ సినిమాకు రితేష్‌ రానా దర్శకత్వం వహించగా కాళ భైరవ సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమా లో ప్రముఖ నటీ నటులు అయిన వెన్నెల కిషోర్‌.. గెటప్‌ శ్రీను.. సత్య ఇంకా పలువురు కమెడియన్స్ ఉన్నారు. ఈ సినిమా ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌ గా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ మద్య కాలంలో చిన్న సినిమాలకు కూడా మంచి స్పందన దక్కుతుంది. కనుక లావణ్య త్రిపాఠికి ఈ సినిమా తో సక్సెస్ దక్కుతుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.