హాకీ స్టిక్ తో అదిరే ఎంట్రీ ఇచ్చిందే!

Sun Dec 15 2019 15:30:18 GMT+0530 (IST)

Lavanya Tripathi As Lavanya Rao in A1 Express Movie

గత కొంతకాలంగా లావణ్య త్రిపాఠి ఏమైపోయింది? అంటూ అభిమానుల్లో ఒకటే సందేహం. అయితే అలాంటి వారందరికీ అదిరిపోయే షాకిస్తూ సోగ్గాడే బ్యూటీ ఇదిగో ఇలా ఎంట్రీ ఇచ్చింది. సోగ్గాడే చిన్ని నాయనా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లావణ్య త్రిపాఠికి సరైన బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తోంది లావణ్య. ఇటీవల ఈ అమ్మడిని వరుసగా ఫ్లాపులు ఇబ్బంది పెట్టాయి. ఇలాంటి టైమ్ లో అర్జున్ సురవరం కొంత ఊరటనిచ్చే రిజల్ట్ ని అందుకుంది. ఇప్పుడు `ఏ1 ఎక్స్ ప్రెస్`లో ఈ భామకు అదిరిపోయే ఆఫర్ తగిలిందని తాజాగా రివీలైన పోస్టర్ చెబుతోంది.రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ స్పోర్ట్స్ డ్రెస్ ధరించి హాకీ స్టిక్ పట్టుకుని పర్ఫెక్ట్ ప్లేయర్ లా ప్రత్యక్షమైంది. A1 వర్సెస్ లావణ్య అంటూ రిలీజ్ చేసిన బర్త్ డే పోస్టర్ క్షణాల్లో యువతరంలో వైరల్ అయిపోయింది. లావణ్యకు ఏ1 టీమ్ పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్ ఇదని చెప్పాలి.

సందీప్ కిషన్ కథానాయకుడిగా.. లావణ్య కథానాయికగా.. నటిస్తున్న ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ కనుకలాను దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ లో షూటింగ్ ప్రారంభమైంది. శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజ సంగీతం అందిస్తున్నారు.  పీపుల్స్ మీడియా టీజీ విశ్వ ప్రసాద్- అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబోట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏ వన్ ప్లేయర్ గా సందీప్ ఏమేరకు రాణిస్తాడు? అన్నది అటుంచితే అతడికి లావణ్య రూపంలో ఠఫ్ కాంపిటీషన్ ఎదురవుతోందనే ఈ పోస్టర్ చెబుతోంది.