ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్

Sun Jul 25 2021 18:00:02 GMT+0530 (IST)

Launch the trailer over the NTR? hands

సత్యదేవ్ హీరోగా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా రూపొందిన తిమ్మరుసు సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఇప్పటికే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఓటీటీ ఆఫర్లు వచ్చినా కూడా ఈ సినిమాను థియేటర్ రిలీజ్ కు సిద్దం చేశారు. ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా విడుదల కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. తిమ్మరుసు ను ఈస్ట్ కోస్ట్ బ్యానర్ లో మహేష్ ఎస్ కోనేరు నిర్మించారు. ఈయన కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్ లకు సన్నిహితులు. పీఆర్ గా చేయడంతో పాటు పలు సినిమాలను కూడా నిర్మించిన మహేష్ ఎస్ కోనేరు ను నందమూరి హీరోలు ప్రోత్సహిస్తూ వస్తున్నారు.ఇంతకు ముందు మహేష్ కోనేరు నిర్మించిన సినిమాల కోసం కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్ లు తమ వంతు సహకారం అందించి ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అయ్యారు. ఇప్పుడు తిమ్మరుసు సినిమా ట్రైలర్ ను ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేసేందుకు నిర్మాత సిద్దం అయ్యాడు. ఈనెల 26వ తారీకున తిమ్మరుసు ట్రైలర్ ను ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేయబోతున్నాడు. మహేష్ కోనేరుపై ఉన్న అభిమానంతో ఎన్టీఆర్ ట్రైలర్ విడుదలకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లకు ఇప్పటికి కూడా వ్యక్తిగత పీఆర్ గా చేస్తున్న మహేష్ కోనేరు నిర్మాతగా కూడా వరుసగా సినిమాలను నిర్మిస్తున్నాడు.

తిమ్మరుసు సినిమా పై మొదటి నుండి ఆసక్తిగా ప్రేక్షకులు ఉన్నారు. సత్యదేవ్ మంచి కథలను ఎంపిక చేసుకుని మరీ సినిమాలను తెరకెక్కిస్తాడు అనే టాక్ ఉంది. అందుకే తిమ్మరుసు సినిమాతో ఆయన మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు. శరన్ కొప్పిశెట్ట దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ట్యాక్సీవాలా హీరోయిన్ అయిన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ నటించింది. ఈ సినిమా ఆమెకు చాలా కీలకం. ఇంతటి బజ్ ఉన్న సినిమా ట్రైలర్ ను ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయించడం వల్ల మరింతగా ఈ సినిమా గురించిన చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

థియేటర్లు మూత బడి దాదాపుగా మూడు నెలలు అవుతుంది. మళ్లీ తిమ్మరుసు సినిమాతో థియేటర్లు ఓపెన్ కాబోతున్నాయి. జనాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్లకు వస్తారా అంటే డౌటే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయినా కూడా సినిమాపై నమ్మకంతో కంటెంట్ ఉన్న సినిమా అంటూ తిమ్మరుసును థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాత సిద్దం అయ్యాడు.

సినిమా విడుదల అయ్యే వరకు కూడా అనుమానమే అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం సినిమా థియేటర్లలో రావడం పక్కా అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తిమ్మరుసు సినిమా తో పాటు తేజ సజ్జా హీరోగా నటించిన ఇష్క్ సినిమా కూడా ఈనెల 30వ తారీకునే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. మరి ఇందులో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి.