ప్రాజెక్ట్ K లో ప్రభాస్ పాత్రలో ట్విస్టు అదే

Sun Oct 24 2021 13:04:24 GMT+0530 (IST)

Latest Update On Prabhas ProjectK

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా హై బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ `ప్రాజెక్ట్ K` మేకర్స్ సినిమాలో ప్రభాస్ పాత్రపై ప్రధాన లీక్ ఇచ్చారు. ప్రభాస్ ప్రత్యేకమైన రోజున శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రాజెక్ట్ కె మేకర్స్ అతన్ని `సూపర్ హీరో` అంటూ ప్రశంసించడం కీలక హింట్ గా మారింది. ప్రాజెక్ట్ K ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కావడంతో చిత్ర బృందం ప్రభాస్ ని సూపర్ హీరో అని పిలవడం యాధృచ్ఛికం కాదు. ఇది సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి ఒక ప్రధాన సూచన అని భావించాలి.  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నిజంగానే సూపర్ హీరోగా కనిపిస్తాడనే నెలరోజుల ఊహాగానాలు సాగుతుండగా.. తాజా స్పెషల్ అప్ డేట్ తో అభిమానులు థ్రిల్ కి గురయ్యారనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్- దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషిస్తున్న ప్రాజెక్ట్ కె ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. డాని శాంచెజ్-లోపెజ్ కెమెరా వర్క్ ని అందించనున్నారు. నవంబర్ నుంచి ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

`రాధేశ్యామ్` టీజర్ రికార్డులు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  నటించిన రాధే శ్యామ్ టీజర్ అంతర్జాలంలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ బర్త్ డే కానుకగా ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ రిలీజైంది. ఇప్పటికే ఇది భారీ వ్యూస్ తో దూసుకెళుతోంది. కొన్ని గంటల్లోనే 3 కోట్ల మంది వీక్షించడం ఆసక్తికరం. 20 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్ దక్కడం ఓ రికార్డ్. టీజర్ ఎంత సైలెంట్ గా ఉందో అంతే శరవేగంగా అభిమానుల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా రాధేశ్యామ్ జనవరిలో అత్యంత భారీగా రిలీజ్ కానుంది.

ఓవర్సీస్ లోనూ రాధేశ్యామ్ పై ఆసక్తి

`రాధేశ్యామ్` చిత్రీకరణ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే. 1970 కాలం నాటి పీరియాడిక్ కథాంశానికి తగ్గట్టుగా సెట్స్ లో నాటి వాతావరణం క్రియేట్ చేసి షూటింగ్ చేసారు చిత్రబృందం. ఇందులో యాక్షన్ సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన సీజీ వర్క్ కూడా ఎక్కువగా ఉంది. దీంతో ఈ పనులన్నింటిని పూర్తి చేయడానికి రెండు..మూడు కంపెనీలకు ఆ బాధ్యతల్ని అప్పగించారు. ప్రస్తుతం ఆ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాని యూవీ  క్రియేషన్స్ - టీ సిరీస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.

నిర్మాతలు 200 కోట్లకు పైగానే బడ్జెట్ ని వెచ్చించారని తెలిసింది. రిలీజ్ ముందు ఈ రెండు నెలల్లో భారీ ప్రచారానికి తెర లేపనున్నారు. అలాగే ఓవర్సీస్ రైట్స్ దిగ్గజ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గ్రేట్ ఇండియన్ ఫిల్మ్స్ కి అప్పగించగా తెలుగు రాష్ట్రాల్లోనూ రాధేశ్యామ్ భారీ బిజినెస్ చేస్తోందని సమాచారం.