మరీ ఇంతగా తగ్గడం బాగాలేదు బేబమ్మ

Tue Oct 04 2022 14:29:00 GMT+0530 (India Standard Time)

Latest PhotoShoot Stills Of Krithi Shetty

ఉప్పెన సినిమా తో తెలుగు వారికి చేరువ అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి వరుసగా సక్సెస్ లు దక్కించుకోవడంతో టాలీవుడ్ లో టాప్ స్టార్ గా నిలిచిన విషయం తెల్సిందే. హీరోయిన్ గా  ఈ అమ్మడు వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ లు దక్కించుకుంది. ఆ వెంటనే మూడు సినిమాలతో ఫ్లాప్ అయిన విషయం కూడా తెలిసిందే.ముద్దుగుమ్మ కృతి శెట్టి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు పడ్డా కూడా ఆఫర్లు మాత్రం దక్కించుకుంటూనే ఉంది. మళ్లీ హిట్ కొట్టి ఈ అమ్మడు తప్పకుండా మంచి సక్సెస్ లను దక్కించుకుంటుందనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఈమె న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతే కాకుండా చర్చనీయాంశంగా కూడా మారింది.

అసలు విషయం ఏంటంటే ఈమె ఈ మధ్య కాలంలో బరువు కాస్త ఎక్కువగానే తగ్గిందని తాజా ఫోటో షూట్స్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. హీరోయిన్ గా స్టార్స్ కి మోస్ట్ వాంటెడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సన్నగా నాజూకుగా ఉండాలి.

కానీ కొందరు కొన్ని రకాలుగా  ఆడియన్స్ కి నచ్చుతారు. అలా కాకుండా మరో విధంగా కనిపిస్తే వారిని జనాలు తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముద్దుగుమ్మ కృతి శెట్టి అదే జరుగుతోంది.

కృతి శెట్టి  ఈ మధ్య చాలా సన్నబడింది. ఆ విషయం ఈ ఫోటో లు చూస్తుంటే అర్థం అవుతోంది. హీరోయిన్ గా ఈమెని ఉప్పెన సినిమాలో చూసి సర్ ప్రైజ్ అయిన వారు మళ్లీ మళ్లీ కృతి శెట్టి  ని అలాగే చూడాలి అనుకుంటున్నారు.

అలా కాదని ఇలా చూడండీ అంటే ఎలా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం కృతి శెట్టి  ఇలా కూడా చాలా బాగుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.