Begin typing your search above and press return to search.

టైగ‌ర్ వేగానికి క‌త్రినా మొగుడు క‌ళ్లెం!

By:  Tupaki Desk   |   5 Dec 2022 12:30 AM GMT
టైగ‌ర్ వేగానికి క‌త్రినా మొగుడు క‌ళ్లెం!
X
బాలీవుడ్ లో టైగ‌ర్ ష్రాప్ యాక్ష‌న్ చిత్రాల వేవ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. యాక్ష‌న్ చిత్రాల‌కు పెట్టింది పేరుగా దూసుకుపో తున్నాడు. చేస్తోన్న ప్ర‌తీ చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న‌చిత్ర‌మే అవుతుంది. ఆర‌కంగా త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. హృతిక్ రోష‌న్...షారుక్ ఖాన్..స‌ల్మాన్ ఖాన్..అమీర్ఖాన్ ల వేగాన్ని అందుకోవ‌డానికి టైగ‌ర్ ఎంతో శ్ర‌మిస్తున్నాడు.

అందుకే తాను ఎంపిక చేసుకుంటోన్న క‌థ‌ల‌న్ని ఎంతో సాహ‌సోపేతంగానే ఉంటున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా టైగ‌ర్ వేగానికి క‌ళ్లెం వేడ‌యానికి మ‌రో హీరో రంగంలోకి దిగుతున్న‌ట్లు తెలుస్తోంది. అత‌నే విక్కీ కౌశ‌ల్. ఇత‌ను కెరీర్ ని `ఉరి` లాంటి చిత్రాల‌తోనే బిల్డ్ చేసుకున్నాడు. దీంతో వీక్కి కి యాక్ష‌న్ స్టార్ గా మంచి గుర్తింపు ఉంది. టైగ‌ర్ రేంజ్ లో బాడీ సిక్స్ ప్యాక్ కాన‌ప్ప‌టికీ యాక్ష‌న్ క‌థ‌లో ఒదిగిపోయే న‌టుడు.

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో యాక్ష‌న్ చిత్రానికి క‌మిట్ అయిన‌ట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ మేక‌ర్ ల‌క్ష్మ‌ణ్ ఉట్టేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వార్ నేప‌థ్యంలో ఓ సినిమా చేస్తున్నాడుట‌. ఇది భారీ యాక్ష‌న్ చిత్ర‌మ‌ని..భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ పై దినేష్ విజ‌య్ ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకొస్తున్నారు.

వ‌చ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రారంభించాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఈసినిమా క‌థ టైగ‌ర్ వేగానికి క‌ళ్లెం వేసేలాగే ఉంటుందిట‌. కంటెంట్ ప‌రంగా చాలా బ‌లంగా ఉంటుంద‌ని దర్శ‌కుడి స‌న్నిహితులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే టైగ‌ర్ కి పోటీగానే ఈ చిత్రాన్ని దించే ప్లాన్ లో ఉన్న‌ట్లు స‌మ‌చారం. ఇటీవ‌లే టైగ‌ర ష్రాప్ జ‌గ‌న్ శ‌క్తి ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ యాక్ష‌న్ సినిమాకి క‌మిట్ అయిన సంగతి తెలిసిందే. ఇది వ‌చ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో విక్కీ క‌మిట్ అయిన సినిమా కూడా వ‌చ్చే ఏడాది ప్రారంభం అవుతుంది. అలా ఇద్ద‌రు రిలీజ్ బ‌రిలోనూ పోటీ ప‌డే అవ‌కాశం ఉంది.