రోటీన్ కు భిన్నంగా నయన్ - విఘ్నేష్ పెళ్లి ఆహ్వానపత్రిక

Sun May 29 2022 10:29:09 GMT+0530 (IST)

Unlike Routine Nayan - Vignesh Wedding Invitation Card

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సూపర్ హీరోయిన్ నయనతార పెళ్లికి లగ్నం కుదరటం తెలిసిందే. ఏళ్లకు ఏళ్లుగా ఆమె పెళ్లి ముచ్చట గురించి వచ్చినన్ని వార్తలు అన్ని ఇన్ని కావు. వాటికి పుల్ స్టాప్ పెడుతూ.. దర్శకుడు విఘ్నేష్ శివన్ తో లవ్ లాక్ చేసి.. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయాన్ని కొద్ది కాలం క్రితం తీసుకోవటం తెలిసిందే. ప్రస్తుతం పెళ్లి పనుల్లో.. షాపింగ్ లో బిజీబిజీగా ఉన్నారీ జంట.ఇంతకీ నయన్ - విఘ్నేష్ పెళ్లి ఎక్కడ జరుగుతుందన్న దానిపై క్లారిటీ లేకపోవటం తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించిన స్పష్టతను తాజాగా బయటకు వచ్చిన వెడ్డింగ్ ఇన్విటేషన్ చెప్పేస్తుంది. రోటీన్ కు భిన్నంగా ఈ తరానికి తగ్గట్లు నయన - విఘ్నేష్ పెళ్లి వేడుకకు సంబంధించిన వివాహ ఆహ్వానపత్రికను డిజిటల్ రూపంలో సిద్ధం చేయించారు.
చూడ ముచ్చటగా ఉన్న ఈ పెళ్లి పత్రికను తమకు అత్యంత సన్నిహితులకు.. బంధువులకు మాత్రమే పంపుతున్నారు.
తమ వివాహ వేడుకకు అతిధులను పరిమితంగా పిలుస్తున్న నేపథ్యంలో ఈ డిజిటల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ బయటకు రాలేదు. తాజాగా దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

జూన్ 9న మహాబలిపురంలో ఈ ఇద్దరి పెళ్లి జరగనున్నట్లు డిజిటల్ ఇన్విటేషన్ చెబుతోంది. దీంతో.. ఇంతకాలం తిరుపతిలో పెళ్లి అన్నది తప్ప విషయం తేలిపోయినట్లే.

మహాబలిపురంలోని ఒక రిసార్టులో ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. నీలి ఆకాశం.. అందమైన ఇల్లు.. చుట్టూ పచ్చని చెట్లతో డిజైన్ చేసిన డిజిటల్ ఇన్విటేషన్ కార్డు నయన్ - విఘ్నేష్ వివాహ వేడుకకు తగ్గట్లే అందంగా ముస్తాబు చేసినట్లు చెబుతున్నారు. తమ పెళ్లి ఇన్విటేషన్ తో సెలబ్రిటీల పెళ్లిళ్లలోనూ కొత్త తరహా విధానాన్ని షురూ చేశారని చెప్పాలి.