Begin typing your search above and press return to search.

పవర్ఫుల్ డాగ్ తో హ్యాండ్సమ్ అఖిల్

By:  Tupaki Desk   |   25 Jun 2022 8:46 AM GMT
పవర్ఫుల్ డాగ్ తో హ్యాండ్సమ్ అఖిల్
X
అక్కినేని అఖిల్ ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకోక పోయినప్పటికీ కూడా అతనికి ఒక మంచి క్రేజ్ అయితే ఉంది. అతని కటౌట్ కి తగ్గట్టుగా ఒక పవర్ఫుల్ సినిమా తీస్తే తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సక్సెస్ అవుతుంది అని చెప్పవచ్చు. అయితే ఇంతవరకు ఈ అవకాశాన్ని ఏ దర్శకుడు కూడా ఉపయోగించుకోలేకపోయాడు. ఇక మొదటి సారి మాస్ దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్ తో ఒక సరికొత్త వండర్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు అని చెప్పవచ్చు.

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరపైకి రాబోతున్నారు ఏజెంట్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఓ వర్గం ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఏజెంట్ అయితే టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక అఖిల్ కు సంబంధించిన లేటెస్ట్ లుక్స్ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయిమ్

రీసెంట్గా డార్క్ లైటింగ్ లో కనిపించిన విధానం విభిన్నంగా ఉంది. అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అంతేకాకుండా అతని చేతిలో పవర్ఫుల్ డాగ్ పిట్బుల్ కూడా ఉంది. తన పెంపుడు కుక్క తో అఖిల్ నవ్వుతూ ఇచ్చిన స్టిల్ చాలా అందంగా ఉన్నట్లుగా ఫాలోవర్స్ కామెంట్ చేస్తున్నారు.

అఖిల్ ఫోకస్ మొత్తం కూడా ఏజెంట్ సినిమా పైనే పెట్టాడు. అతడి దగ్గరికి వచ్చిన కొత్త కథలను కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ సినిమాపై నమ్మకంతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.

అలాగే అఖిల్ ఏజెంట్ తర్వాతనే తన కెరీర్ను ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయంలో కూడా ఒక నిర్ణయానికి రానున్నాడు. అందుకే ఏజెంట్ రిజల్ట్ అతనికి చాలా ముఖ్యం కానుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.