హరీష్ స్క్రిప్టులో పాన్ ఇండియా ఛేంజెస్?

Sun Dec 04 2022 10:25:36 GMT+0530 (India Standard Time)

Latest Changes In Harishshankar Script

ఒకప్పటిలా ఏదో ఒక సాధారణ కథను ఫైనల్ చేసి వెంటనే సెట్స్ కెళ్లిపోయే సన్నివేశం ఇప్పుడు లేదు. మూస ఫార్ములా కథలకు ఛాన్సే లేదు. మన స్టార్ హీరోల ఆలోచనలు పాన్ ఇండియా లెవల్ కి ఎదిగాయి. ఇరుగు పొరుగు మార్కెట్లను కొల్లగొట్టే యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలకు మాత్రమే ఇప్పుడు ఓకే చెబుతున్నారు. పాత `మిరపకాయ్` కథలు వినేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. పవర్ స్టార్ లాంటి హీరో ఇప్పుడు ఏదైనా కథను ఎంపిక చేస్తే అది `గబ్బర్ సింగ్` కంటే పదింతలు హిట్టు కొట్టేయాలి. అది పాన్ ఇండియాలో ఆడాలి. లేదంటే దర్శకరచయితలకు అవకాశం ఇవ్వడం కుదరదు.

కారణం ఏదైనా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలంగా మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ని హైడ్ లోనే ఉంచారు ఎందుకనో. `భవదీయుడు భగత్ సింగ్` ప్రకటించి చాలా కాలమే అయినా కానీ అది ఇంకా సెట్స్ కెళ్లలేదు. రకరకాల కారణాలతో వాయిదాల ఫర్వంలో పడింది.

అయితే పవన్ ఇంతకుముందే హరీష్ కి స్క్రిప్టు పరమైన మార్పులు చెప్పారని గుసగుస వినిపించింది. దాని ప్రకారం.. హరీష్ స్క్రిప్ట్ ని రీఎగ్జిక్యూట్ చేసి మొత్తం డైమెన్షన్ ను మార్చేశాడని తెలుస్తోంది. పవన్ కి ఇప్పటి ట్రెండ్ కు అనుగుణమైన స్క్రిప్టును వినిపించి ఓకే చేయించుకున్నాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏడాది కిందటి కథ ఇప్పుడు సినిమాగా తీయాలన్నా సన్నివేశం మారాక.. తిరిగి రీవర్క్ చేయాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. భవదీయుడు కథను హరీష్ రెడీ చేసి చాలా కాలమే అయ్యింది. అందుకే నేటి మారిన ట్రెండ్ కి తగ్గట్టు స్క్రిప్టును మలిచాడని భావిస్తున్నారు.

పవన్ కోసం ఈసారి యూనిక్ నెస్ తో కూడుకున్న కమర్షియల్ సబ్జెక్ట్ ని హరీష్ రాశాడని చిన్నపాటి మెసేజ్ తోను అభిమానులను మెప్పించే సినిమాని అందిస్తాడనే నమ్మకంతో ఉన్నారు.

ఈ నెలలో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించి వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారని తెలిసింది. నటీనటులు సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సాహో ఫేం సుజీత్ దర్శకత్వంలో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ భారీ సినిమాని ఈ ఆదివారం (04 డిసెంబర్) ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా పోస్టర్ ని వీక్షిస్తే పవన్ కల్యాణ్ షాడోని ఒక ఆరడుగుల వెపన్ (గన్) లా ఆవిష్కరించిన తీరు మాస్ కి పూనకాలు తెప్పించింది. మరోసారి పవన్ నుంచి గబ్బర్ సింగ్ ని మించినది అభిమానులు ఆశిస్తున్నారు. నిజానికి గబ్బర్ సింగ్ చిత్రంతో ఫ్లాపుల్లో ఉన్న పవన్ కి అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన హరీష్ శంకర్ నుంచి ఫ్యాన్స్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆశిస్తారు. దానికి తగ్గట్టే ఈసారి అంతకుమించి అనే రేంజులో స్క్రిప్టుతో వస్తున్నాడనే ఆశిద్దాం.