ఎన్టీఆర్30 కన్ఫ్యూజన్.. అసలేం జరుగుతోంది?

Mon Sep 13 2021 09:06:53 GMT+0530 (IST)

Latest Buzz On ntr30

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ముగిసింది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా సినిమా షూటింగ్ ముగిసినట్లుగా మేకర్స్ ఇప్పటికే కేక్ కట్ చేసి మరీ చెప్పేశారు. ఒక వైపు రామ్ చరణ్ తన తదుపరి సినిమా కోసం ఇప్పటికే రెడీ అయ్యాడు. శంకర్ దర్శకత్వంలో సినిమా పూజా కార్యక్రమాలు ముగిశాయి. అక్టోబర్ లో రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో స్పష్టత రావడం లేదు. ఎన్టీఆర్ 30 సినిమాకు కొరటాల శివ దర్శకుడు అనే విషయం మాత్రమే స్పష్టత వచ్చింది. మొదట ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కాని ఆగస్టు పోయింది.. సెప్టెంబర్ కూడా సగం రోజులు ముగిశాయి. ఈ సమయంలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ 30 సినిమా గురించిన అప్ డేట్ ఇవ్వక పోవడంతో నందమూరి అభిమానుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. కొరటాల ఎప్పుడు సినిమాను ప్రారంభిస్తారనే చర్చ మొదలు అయ్యింది.ఎన్టీఆర్30 సినిమా చిత్రీకరణ మొదలు పెట్టడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇటీవలే కొరటాల సన్నిహితులు మీడియా వర్గాలతో అనధికారికంగా అన్నారట. కథ విషయంలో ఇంకా తుది నిర్ణయం జరగలేదని.. స్క్రిప్ట్ కు సమయం పడుతుందని.. కనుక ఎన్టీఆర్ 30 సినిమా ప్రారంభం కోసం అభిమానులు ఎదురు చూడాల్సిందే అంటూ వారు చెప్పారట. మొన్నటి వరకు ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా స్టూడెంట్ లీడర్ కథతో ఉంటుందని.. సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. అల్లు అర్జున్ తో ఈ సినిమాను చేయాలని కొరటాల శివ భావించాడు. కాని కొన్ని కారణాల వల్ల బన్నీతో సినిమా క్యాన్సిల్ అయ్యింది. దాంతో తప్పని పరిస్థితుల్లో ఎన్టీఆర్ తో ఆ కథను చేసేందుకు కొరటాల కొన్ని మార్పులు చేసి సిద్దం అయ్యాడు అంటూ ప్రచారం జరిగింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కథ ఇంకా రెడీ అవ్వలేదంటే ఎన్టీఆర్ తో చేయబోతున్న కథ అది కాదా అనే కన్ఫ్యూజన్ మొదలు అయ్యింది.

కొరటాల శివ ఆచార్య సినిమా కూడా ఇంకా గుమ్మడి కాయ కార్యక్రమం కు నోచుకోలేదు. రెండు పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉన్నట్లుగా ఆమద్య మేకర్స్ ప్రకటించారు. ఆ రెండు పాటల చిత్రీకరణ పూర్తి అవ్వాలి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ముగియాలి. కనుక ఆచార్య సినిమా ను ముగించిన తర్వాత ఎన్టీఆర్ 30 ని పట్టాలెక్కించే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా చాలా సమయం పడుతుంది అంటూ కొందరూ ఊహించుకుంటున్నారు. ఎవరికి వారు ఎన్టీఆర్ 30 గురించి ఊహించేసుకుంటున్నారు. ఈ సమయంలో మేకర్స్ నుండి ఒక క్లారిటీ వస్తే కాని ఈ ఊహలకు తెర పడదు. ఎన్టీఆర్ 30 సినిమాను కొరటాల శివ సన్నిహితుడు మరియు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కలిసి నిర్మిస్తున్న విషయం తెల్సిందే. కొరటాల శివ ఇప్పటి వరకు అపజయం ఎరుగలేదు. కనుక ఎన్టీఆర్ 30 కూడా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అవుతాడు. కనుక ఆయన పాన్ ఇండియా స్టార్ డమ్ కు తగ్గట్లుగా కొరటాల శివ కథను కొత్తగా యూనివర్శ్ ప్రేక్షకులకు అన్నట్లుగా రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది. మొత్తానికి ఎన్టీఆర్ 30 గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం తో అసలు ఏం జరుగుతందా అంటూ అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.