Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: RRR కి సైడిస్తున్న ఆ న‌లుగురు?

By:  Tupaki Desk   |   16 Oct 2021 4:02 AM GMT
ట్రెండీ టాక్‌: RRR కి సైడిస్తున్న ఆ న‌లుగురు?
X
2021-22 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ RRR రిలీజ్ తేదీని ప్ర‌క‌టించింది మొద‌లు సంక్రాంతి సీజ‌న్ లో ఇత‌ర సినిమాల రిలీజ్ తేదీల‌పై ర‌క‌ర‌కాల సందిగ్ధ‌త‌లు నెల‌కొన్నాయి. దేశంలో అత్యంత భారీ క్రేజుతో అన్ని భాల్లోనూ రిలీజ్ కి రెడీ అవుతున్న RRR తో పోటీప‌డుతూ ఇత‌ర సినిమాల్ని ఇదే స‌మ‌యంలో రిలీజ్ చేయ‌డం స‌రైన నిర్ణ‌య‌మేనా? అన్న దానిపై ఎవ‌రి విశ్లేష‌ణ‌లు వారికి ఉన్నాయి.

2022 సంక్రాంతి కానుక‌గా RRR రిలీజ‌వుతోంది. బాహుబ‌లి ద‌ర్శ‌కుడి నుంచి వ‌స్తున్న సినిమాగా RRR కి ఉన్న క్రేజు వేరే. చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ ల స్టార్ డ‌మ్ దృష్ట్యా ఇది అసాధార‌ణ ప్రాజెక్టుగా రూపాంత‌రం చెందింది. అందుకే సంక్రాంతి రేసులో వ‌స్తున్న ఇత‌ర నిర్మాత‌ల ఆలోచ‌న‌లు మారుతున్నాయ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇప్ప‌టికే సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మెగాస్టార్- కొర‌టాల‌ `ఆచార్య` ఇప్ప‌టికే ఫిబ్ర‌వ‌రికి వాయిదా ప‌డింద‌ని క‌థ‌నాలొచ్చాయి.

అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న భీమ్లా నాయ‌క్ ని.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న స‌ర్కార్ వారి పాట చిత్రాన్ని వాయిదా వేయ‌నున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమాల చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. అయితే త‌మ సినిమాల్ని వాయిదా వేసుకుంటున్న‌ట్టు చిత్ర‌బృందాలు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. సోష‌ల్ మీడియాల్లో మాత్ర‌మే ఇది డేబేట్ గా మారింది.

భీమ్లా నాయ‌క్ రిలీజ్ తేదీ విష‌యంలో పూర్తి స్ప‌ష్ఠ‌త‌తో ఉన్నారు. ఇటీవ‌ల ప్ర‌చార వీడియోలు పోస్ట‌ర్ల‌లోనూ జ‌న‌వ‌రి 12 రిలీజ్ కి క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు వెల్ల‌డించారు. అలాగే స‌ర్కార్ వారి పాట రిలీజ్ తేదీ పైనా ప‌ర‌శురామ్ టీమ్ క్లారిటీనిస్తుంద‌నే భావిస్తున్నారు. తాజా రూమ‌ర్ల న‌డుమ సంక్రాంతి రిలీజ్ ల‌పై మ‌రింత క్లారిటీ రావాల్సి ఉంది. సంక్రాంతి బ‌రిలో ప‌వ‌న్ -మ‌హేష్ - చిరు పోటీ ఉంటుంద‌ని భావించినా అంతా మారుతోంది. సంక్రాంతికి ఇత‌ర పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయ‌ని భావిస్తున్నా వాటిపైనా క్లారిటీనివ్వాల్సి ఉంది.