ముంబైని టార్గెట్ చేసిన `లైగర్`..అసలు కథేంటి?

Sun Oct 24 2021 17:09:48 GMT+0530 (IST)

Latest Buzz On Liger Movie Story

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `లైగర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ ముంబై..హైదరాబాద్.. గోవా  లో షూట్ చేసారు. అవసరం మేర గోవాలో కూడా   సెట్లు నిర్మించి షూటింగ్ చేసారు. నేరుగా అక్కడ  ఓ స్టేడియం సెట్ నిర్మించి అందులోనే షూటింగ్ చేసారు.  ఆ తర్వాత మరో  షెడ్యల్ ని విదేశాల్లో షూట్ చేసారు. దీంతో దాదాపు చిత్రీకరణ మెజార్టీ పార్ట్ పూర్తయినట్లు మీడియా కథనాలు హీటెక్కించాయి. అయితే తాజాగా యూనిట్ మరోసారి ముంబై లో మరో షెడ్యూల్ వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాతలలో ఒకరైన చార్మి ట్విటర్ ద్వారా తెలిపింది.శుక్రవారం  `రొమాంటిక్`  ప్రీ రిలీజ్ ఈవెంట్ ని యూనిట్ వరంగల్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈవెంట్ ముగిసిన వెంటనే స్పెషల్ చార్టెడ్ ప్లైట్ లో `లైగర్` టీమ్ అంతా ముంబై లో వాలిపోయిట్లు చార్మి తెలిపింది. విజయ్ దేవరకొండ..చార్మీ..పూరి అంతా ఇప్పుడు ముంబైలోనే ఉన్నారు. కొత్త షెడ్యూల్ ప్లానింగ్ లో భాగంగా కీలక నటులంతా షూట్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పటికే ముంబైలో చాలా భాగం షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత సినిమా ప్రారంభోత్సవం అక్కడే జరిగింది. ఆ తర్వాత ఏకధాటిగా షూటింగ్ కూడా ప్రత్యేకంగా సెట్లు  వేసి చేసారు. అటుపైనే  యూనిట్ ఔట్ డోర్ షూటింగ్ కి వెళ్లింది.

తాజాగా మరోసారి ముంబై వెళ్లడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా పూరి ఇన్ని రోజుల పాటు షూటింగ్ చేయరు. ఎంత పెద్ద స్టార్ అయినా మూడు..నాలుగు నెలల్లో షూటింగ్ మొత్తంచుట్టే స్తారు. కానీ `లైగర్` కోసం మాత్రం చాలా సమయాన్ని కేటాయించి నట్లు తెలుస్తోంది. అలాగే ఈసారి ప్రత్యేకంగా ముంబైని టార్గెట్ చేసి షూటింగ్ చేయడం విశేషం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. పూరి కనెక్స్ట్..ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.