Begin typing your search above and press return to search.

బికినీ బీచ్ లో 6 ప్యాక్ తో చెల‌రేగిన‌ తిక్క లేడీ

By:  Tupaki Desk   |   6 Dec 2021 12:30 AM GMT
బికినీ బీచ్ లో 6 ప్యాక్ తో చెల‌రేగిన‌ తిక్క లేడీ
X
బికినీ బీచ్ ని మ‌రిగిస్తోంది ఈ సోగ‌కాళ్ల సుంద‌రి. అలా బీచ్ లో ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో హీట్ పెంచింది. ఓవైపు సూర్యుడు మరుగుతూ ఉంటే చెమ‌ట‌లు ప‌డుతున్నా అలా బీచ్ లో ఒంటిపై దుస్తుల్లేకుండా కేవ‌లం టూపీస్ లో హొయ‌లు పోయింది.

ఇంత‌కీ ఎవ‌రీ బ్యూటీ? అంటే తిక్క సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన టాప్ మోడ‌ల్ లారిస్సా బోనెస్సి. ఇంత‌కుముందు బైక్ యాక్సిడెంట్ కి గురైన త‌న హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకున్న ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాల్లో మెగా ఫ్యాన్స్ కి ట‌చ్ లోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం తెలుగులో అవ‌కాశాల కోసం వ‌ల‌లు వేస్తోంద‌ని స‌మాచారం.

తాజా లుక్ లో లారిస్సా 6 ప్యాక్ రూపం బ‌య‌ట‌ప‌డింది. మునుప‌టి కంటే ఈ బ్యూటీ ఇంకా స్లిమ్ లుక్ తో క‌వ్విస్తోంది. అలా స్టైలిష్ గా రెబాన్ ధ‌రించి హొయ‌లు పోతోంది. ఒంటిపై నూలుపోగైనా ఉందా? అనిపించేంత‌గా రెండు పేలిక‌ల బికినీ మ‌రీ టూమ‌చ్ అంటూ బోయ్స్ ఒక‌టే కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. లారిస్సా బ్యాక్ ఫీట్ ఫోజుతో క‌వ్వింత‌పైనా టూమ‌చ్ కామెంట్లు చేస్తున్నారు. తెలుగు-త‌మిళం స‌హా హిందీలోనూ లారిస్సా ప్ర‌య‌త్నాల్లో ఉంది. అడ‌పాద‌డ‌పా సింగిల్ ఆల్బ‌మ్స్ లో న‌టిస్తూ ఉనికిని చాటుకుంటోంది లారిస్సా.