Begin typing your search above and press return to search.

`లాల్ సింగ్.. పై పీవీఆర్ కాంటెస్ట్‌.. ప్రేక్ష‌కుల దిమ్మ‌దిరిగే రిప్లై!

By:  Tupaki Desk   |   17 Aug 2022 12:21 PM GMT
`లాల్ సింగ్.. పై పీవీఆర్ కాంటెస్ట్‌.. ప్రేక్ష‌కుల దిమ్మ‌దిరిగే రిప్లై!
X
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ న‌టించిన లేటెస్ట్ మూవీ `లాల్ సింగ్ చ‌డ్డా`. అద్వైత్ చంద‌న్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ హాలీవుడ్ ఫిల్మ్ `ఫారెస్ట్ గంప్‌` ఆధారంగా తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. క‌రీనా క‌పూర్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీతో తెలుగు హీరో నాగ‌చైత‌న్య బాలీవుడ్ కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఇందులో బోడి బాల‌రాజు గా అథితి పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఆగ‌స్టు 11న విడుద‌లైన ఈ మూవీ డిజాస్ట‌ర్ టాక్ ని సొంతం చేసుకుంది. అమీర్ న‌టించిన సినిమాల్లో అత్యంత డిజాస్ట‌ర్ అనిపించుకుంది.

హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక దేశ వ్యాప్తంగా గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది. అమీర్ ఖాన్ పై వున్న తీవ్ర వ్య‌తిరేక‌త కార‌ణంగా ఈ మూవీ థియేట‌ర్ల వ‌ద్ద‌కు ఎవ‌రూ వెళ్ల‌డం లేదు. దీంతో థియేట‌ర్స్ యాజ‌మాన్యం రెండు టికెట్ లు కొంటే ఒక‌టి ఫ్రీ అనే స్కీమ్ ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్రం చేస్తున్నారు.

ఇక ఈ మూవీతో పాటు ఆగ‌స్టు 11న అక్ష‌య్ కుమార్ న‌టించిన `ర‌క్షా బంధ‌న్‌` కూడా విడుద‌లైంది. ఈ మూవీ ప‌రిస్థితి కూడా ఇదే త‌ర‌హాలో వుంది. దీంతో పీవీర్ థియేట‌ర్స్ వారు ప్రేక్ష‌కుల‌ని ఆక‌ర్షించ‌డానికి థియేట‌ర్ల వ‌ద్ద రెండు టికెట్ లు కొంటే ఒక‌టి ఫ్రీ అనే స్కీమ్ లు పెట్ట‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అయితే ఉత్త‌రాది ప్రేక్ష‌కులు పీవీఆర్ థియేట‌ర్స్ వారి స్కీమ్ కు దిమ్మ‌దిరిగే రిప్లై ఇస్తున్నారు. ప్రేక్ష‌కులు రాని సినిమాల‌ని థియేట‌ర్ల‌లో ఆడిపించ‌డం కంటే `కార్తికేయ 2` కు థీయేట‌ర్లు కేటాయించండి అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

నిఖిల్ న‌టించిన `కార్తికేయ 2` ఆగ‌స్టు 13న విడుదలైన విష‌యం తెలిసిందే. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఉత్త‌రాదిలోనూ ఈ మూవీ హిందీ వెర్ష‌న్ మ‌రింత జోరు చూపిస్తూ రికార్డు స్థాయి క‌లెక్ష‌న్ ల దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఇప్ప‌టికే బ్రేక్ ఈవెన్ ని సాధించిన ఈ మూవీ ఉత్త‌రాదిలో రికార్డు స్థాయి వ‌సూళ్ల దిశ‌గా ప‌నినిస్తోంది. అయితే ఈ మూవీకి ఉత్త‌రాదిలో పెద్ద‌గా థియేట‌ర్లు కేటాయించ‌లేదు.

లాల్ సింగ్ చ‌డ్డా, ర‌క్షా బంధ‌న్ చిత్రాలు హిందీ సినిమాలు కావ‌డంతో వాటికే అత్య‌ధికంగా థియేట‌ర్లు కేటాయించారు. ఈ సినిమాలు ప్ర‌ద‌ర్శిస్తున్న థియేట‌ర్లు ప్రేక్ష‌కులు లేక వెల వెల బోతుండ‌టంతో పీవీఆర్ సినిమాలు వారు రెండు టికెట్ లు కొంటే ఒక‌టి ఫ్రీ అనే స్కీమ్ ని ప్రారంభించారు. అయితే లాల్ సింగ్ చ‌డ్డా, ర‌క్షా బంధ‌న్ చిత్రాలు తొల‌గించి వాటి స్థానంలో `కార్తికేయ 2`కు థియేట‌ర్లు కేటాయించండి అంటూ నెటిజ‌న్స్ పీవీఆర్ వారిని డిమాండ్ చేస్తుండ‌టం ఇప్ప‌డు నెట్టింట వైర‌ల్ గా మారింది.