Begin typing your search above and press return to search.

రెహమాన్ సంగీత సాధనలో ఐశ్వర్య రజినీ..!

By:  Tupaki Desk   |   27 Nov 2022 2:30 PM GMT
రెహమాన్ సంగీత సాధనలో ఐశ్వర్య రజినీ..!
X
అకాడెమీ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. దశాబ్ధాలుగా తన మ్యూజిక్ తో సంగీత ప్రియులను అలరిస్తున్నారు. ఒక సినిమాకు రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నారు అంటే అది సంథింగ్ స్పెషల్ అన్నట్టే ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాకు రెహమాన్ మరోసారి తన సంగీతంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రెహమాన్ సూపర్ స్టార్ రజిని కూతురు ఐశ్వర్య చేస్తున్న లాల్ సలాం మూవీకి సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో రెహమాన్ తో పాటు ఐశ్వర్య పాల్గొన్నారు. రెహమాన్ సంగీత సాధన చేస్తున్న టైం లో ఐశ్వర్య కూడా పక్కన కూర్చుని ఉన్నారు. ఈ వీడియోని రెహమాన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. లేడీ డైరక్టర్ ఐశ్వర్యతో జామింగ్ అంటూ కామెంట్ పెట్టార్ రెహమాన్. రెహమాన్ మ్యూజిక్ ని పక్కనే ఉండి ఆస్వాధిస్తుంది ఐశ్వర్య. ఫీమేల్ డైరక్టర్ గా ఐశ్వర్య ఇదివరకే 3, వై రాజా వై సినిమాలు చేశారు. ఇప్పుడు లాల్ సలాం తో మరోసారి తన దర్శకత్వ ప్రతిభ చాటనున్నారు.

విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ నెల 5న పూజా కార్యక్రమాలు జరుపుకున్న లాల్ సలాం సినిమా పై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీ వస్తున్నట్టు తెలుస్తుంది.

ఐశ్వర్య ఈ మూవీ కోసం బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమాని తమిళంతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. డైరక్టర్ గా తన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తున్న ఐశ్వర్యకు ఈ లాల్ సలాం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

ఈమధ్య తెలుగు, తమిళ సినిమాలన్ని కొద్దిగా బడ్జెట్ మీద దృష్టి పెట్టి.. యూనివర్సల్ కాన్సెప్ట్ అంటూ పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. మరి ఐశ్వర్య కూడా ఈ లాల్ సలాం మూవీని పాన్ ఇండియా రిలీజ్ చేస్తుందా లేక తమిళ భాషలోనే రిలీజ్ చేస్తుందా అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.