Begin typing your search above and press return to search.

'లక్ష్య' కొత్త పోస్టర్: శౌర్య - కేతిక ఇంటెన్స్ ప్రేమకు ఇదే సాక్ష్యం..!

By:  Tupaki Desk   |   30 July 2021 5:58 AM GMT
లక్ష్య కొత్త పోస్టర్: శౌర్య - కేతిక ఇంటెన్స్ ప్రేమకు ఇదే సాక్ష్యం..!
X
యువ హీరో నాగ శౌర్య - కేతిక శర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''లక్ష్య''. ప్రాచీన విలువిద్య (ఆర్చరీ క్రీడ) నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకి ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్ర‌మోష‌న్స్ మొదలు పెట్టిన చిత్ర బృందం.. #LAKSHYASFRIDAY పేరుతో ప్ర‌తీ శుక్ర‌వారం ఓ కొత్త అప్డేట్ ను ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఈరోజు ఫ్రైడే కావడంతో మేకర్స్ తాజాగా 'లక్ష్య' నుంచి సరికొత్త పోస్టర్ ని ఆవిష్కరించారు.

'లక్ష్య' పోస్టర్ లో నాగశౌర్య నుదుటి పై కేతిక శర్మ ముద్దు పెడుతూ కనిపిస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న ఇంటెన్స్ లవ్ కు ఇది సాక్ష్యమని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రాన్ని ఎంటర్టైనింగ్ గా ఉండటంతో పాటుగా ఎగ్జైటింగ్ గా ఉండేలా దర్శకుడు తీర్చిదిద్దుతున్నాడు. ఇది శౌర్య కెరీర్ లో మైలురాయి 20వ చిత్రం. ఇందులో ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని స‌రికొత్త‌ లుక్‌ లో కనిపించనున్నాడు.

కాగా, ఆర్చరీ నేపథ్యంలో ఇండియాలో రూపొందుతున్న మొట్ట మొదటి సినిమా స్పోర్ట్స్ డ్రామా ''లక్ష్య''. ఇందులో విలక్షణ నటుడు జగపతి బాబు - సచిన్ కేడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు - శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.