Begin typing your search above and press return to search.

సెలెబ్రేట్ చేసుకోవాల్సింది విడాకుల సమయంలో: వర్మ

By:  Tupaki Desk   |   24 March 2019 5:50 PM GMT
సెలెబ్రేట్ చేసుకోవాల్సింది విడాకుల సమయంలో: వర్మ
X
'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఒక వెబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ నుంచి కొన్ని ప్రశ్నలు సమాధానాలు చూద్దాం.

* మీరుదేవుడిని నమ్ముతారా?

నమ్మను.

*మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రారంభించడానికి ముందు తిరుపతి వెళ్ళారు కదా?

ఎన్టీ రామారావు గారి మీద భక్తితో వెళ్ళాను. ఆయన నమ్ముతారు కదా అందుకే వెళ్ళాను.

*ఒక మనిషి మనం ఇలా భక్తితో కానీ అభిమానం తో కానీ నమ్మినప్పుడు. ఆమనిషి తాలూకు కొంత ఎఫెక్ట్ మనపై పడుతుంది. అలా లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఆయన ఆత్మ కావచ్చు.. అయన మిమ్మల్ని ఆవహించినట్టు కావచ్చు... ఎప్పుడైనా ఏక్షణమైనా మీకు అనిపించిందా?

డెఫినిట్ గా ఇది ఒక ఎమోషనల్ స్టొరీ.. నేను అయన ఎమోషన్ ను మరోసారి రీ-లివ్ చేస్తున్నప్పుడు.. స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు కానీ.. ఆ సీన్స్ నేను ఫీల్ అవుతున్నప్పుడు కానీ 100% ఆయన నా పక్కనే ఉన్నట్టు.. అయన చెప్తున్నట్టు అనిపించేది.

*మరి అది మీ భ్రమ కాదంటారా?

అయి ఉండొచ్చు. మీరు మీ సెన్సెస్ తో పర్సీవ్ చేస్తారు. అది మీ భ్రమ.. ఊహ.. రియాలిటీనా అనేది ఏదైనా కావచ్చు.

*మీరు బయోపిక్ పై ఎందుకు ఈమధ్య ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు?

ప్రత్యేకంగా ఒక కారణం ఏమీ లేదు. మీరు దాన్ని బయోపిక్ అనొచ్చు అనకపోవచ్చు. కానీ నిజమైన మనుషులకు జరిగినప్పుడు రియల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. రియాలిటీ ఉటుంది.

*ఆర్జీవీ అంటే క్రియేటివ్ దర్శకుడని పేరు. కానీ ఇలాంటి బయోపిక్స్ మీద ఫోకస్ చేస్తూ సమయం వృధా చేస్తున్నాడని మీ ఫ్యాన్స్ కొంతమంది అంటున్నారు. దీనికి మీరేమంటారు?

ఫస్ట్ ఆఫ్ ఆల్.. బయోపిక్ తీయడానికి క్రియేటివిటీ అవసరం లేదనుకున్నవాడు మూర్ఖుడు. బయోపిక్ కు ఇంకా ఎక్కువ క్రియేటివిటీ కావాలి.

*మీపై బయోపిక్ తీసేందుకు ఎవరైనా ముందుకొస్తే వారికి మీరు సపోర్ట్ ఇస్తారా. లేదా మీ బయోపిక్ మీరే తీసుకుంటారా?

డెఫినిట్ గా నా బయోపిక్ నేను తీయను. ఇక ఎవరైనా తీయడానికి ముందుకొస్తే సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది.. అంది వాళ్ళ ఇంట్రెస్ట్.

ఇక పెళ్ళి టాపిక్ గురించి ఒక ప్రశ్న వేస్తే.. అసలు ఎవరైనా సెలెబ్రేట్ చేసుకోవాల్సింది పెళ్ళి సమయంలో కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక తెలియని జోన్ లోకి వెళ్తున్నారు. అదే విడాకులు అనుకోండి.. పీడా విరగడ అయిందిరా బాబూ అంటూ సెలెబ్రేట్ చేసుకోవచ్చు అన్నాడు. చదవడం అయిందిగా.. ఆలస్యం ఎందుకు.. ఒకసారి ఈ క్రేజీ ఇంటర్వ్యూను చూసేయండి. మీరుకూడా పక్కనే వర్మ గారు నిజంగా ఉన్నట్టు ఫీలవుతారేమో. తస్మాత్ జాగ్రత్త.. !