Begin typing your search above and press return to search.

టాలీవుడ్ రత్తాలు సంచలన నిర్ణయం.. అంత డేర్ నిజమేనా..?

By:  Tupaki Desk   |   5 Aug 2020 3:45 AM GMT
టాలీవుడ్ రత్తాలు సంచలన నిర్ణయం.. అంత డేర్ నిజమేనా..?
X
టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ల‌క్ష్మీరాయ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మెగాస్టార్ సరసన రత్తాలు పాటలో డాన్స్ ఇరగదీయడంతో మాస్ ఆడియన్స్ ఆమెను ముద్దుగా రత్తాలు అని పిలుచుకుంటున్నారు. కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన రత్తాలు.. ఇప్పటి వరకు తెలుగులో సరైన సూపర్ హిట్ అందుకోలేదు. అయితే ఈ భామ సినిమాల కంటే కూడా ఎక్కువ‌గా కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచింది. అందంతో పాటు అభినయం తెలిసిన ఈ ముద్దుగుమ్మ కాంట్ర‌వ‌ర్సీ క్వీనుగా పాపులర్ అయింది. కానీ అంతకుముందే లక్ష్మి ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ అయింది. ఇటీవలే తన మీద వచ్చిన రూమర్స్ అన్నింటిపై స్పందించిన రత్తాలు.. త‌న‌పై వస్తున్న అస‌త్య ప్ర‌చారాలను ఖండించి "అవును. నాకు చాలా మంది తో ల‌వ్ ఎఫైర్స్ ఉన్నాయి. బ్రేకప్స్ కూడా జరిగాయి. అంత మాత్రానికే ఇష్టం వచ్చినట్లు రాస్తారా..?" అని ఘాటుగా అడిగిన విషయం తెలిసిందే.

ఇప్ప‌టికే మూడు సార్లు ప్రేమ‌ లో మోస‌పోయాన‌ని.. ఇప్పుడు త‌న దృష్టి మొత్తం సినిమాల‌ పైనే ఉంద‌ని చెబుతుంది ఈ భామ. ఇక తాజా గా అమ్మడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమాలతో పాటు వరుసగా వెబ్ సిరీస్ లలో నటించడానికి సై అంటుందట రాయ్ లక్ష్మి. ఇటీవలే 'పాయిజన్' అనే వెబ్ సిరీస్‌ లో నగ్నంగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కథ నచ్చితే ఎంతటి రిస్క్ అయినా చేసే రత్తాలు.. తాజాగా వెబ్ సిరీస్ కథ నచ్చడంతో ఈ డేర్ చేయడానికి రెడీ అయ్యిందట. ప్రస్తుతం లక్ష్మిరాయ్ కన్నడలో 'ఝాన్సీ'.. తమిళంలో 'సిండ్రెల్లా' అనే సినిమాలతో పాటు తెలుగులో 'ఆనంద భైరవి' అనే మూవీలో నటిస్తోందట. అయితే తాజాగా రత్తాలు డేరింగ్ స్టెప్ గురించి తెలిసేసరికి ఫ్యాన్స్, నెటిజన్లు షాక్ కి గురవుతున్నారు. కానీ ఈ వార్త పై అధికారిక సమాచారం అందే వరకు వెయిట్ చేయక తప్పదు.