షిట్! టాయ్ లెట్లు కడిగి ప్లేట్లు క్లీన్ చేయించే చెత్త షో!!

Mon Sep 28 2020 14:40:15 GMT+0530 (IST)

Lakshmi Menon Talking About Bigg Boss Tamil 4

బిగ్ బాస్ షో పై గత కొంత కాలంగా విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. షో నిర్వాహణపై కంటెస్టెంట్ లకు ఇస్తున్న టాస్క్ లపై చాలా మంది మండిపడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో విశాల్ హీరోయిన్ లక్ష్మీ మీనన్ చేరింది. విశాల్ తో కలిసి లక్ష్మీమీనన్ `పల్నాడు` చిత్రంలో నటించింది. తెలుగులో ఇప్పటికే సీజన్ 4 మొదలైంది.తమిళంలో అక్టోబర్ 4న సీజన్ 4 ప్రారంభం కాబోతోంది. దీనికి హీరో కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. గత మూడు సీజన్ లకు ఆయనే హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. సీజన్ 4 త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో లక్ష్మీ మీనన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ షోలో లక్ష్మీ మీనన్ పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తను ఈ షోలో పాల్గొనడం లేదని లక్ష్మీ మీనన్ ఘాటుగా స్పందించింది. `నేను బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదు. ఇంత వరకు నేను ఒకరు తిన్న ప్లేట్లని కడగడం.... టాయ్ లెట్ లని శుభ్రం చేసే పనుల్ని ఇప్పటి వరకు చేయలేదు. షో పేరుతో కెమెరాల ముందు అతి చేష్టతో ఫైటింగ్స్ చేయడం నాకు అస్సలు నచ్చదు. కాబట్టి ఇలాంటి షిట్ షోలో తను పాల్గొనడం లేదని క్లారిటీ ఇస్తున్నా` అని లక్ష్మీ మీనన్ ఘాటుగా స్పందించింది.