బన్నీతో షారుఖ్ డైరెక్టర్..అన్ని కోట్లు ఆఫర్ చేశారా?

Wed Sep 28 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

Laika Productions Big Deal with Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పాన్ ఇండియా వండర్ `పుష్ప` సీక్వెల్ కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే పూర్తి కావడంతో ఈ మూవీని అక్టోబర్ 10న భారీ స్థాయిలో ప్రారంభించడానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేయడంతో సినిమా పట్టలెక్కడమే తరువాయి అని అంతా అంటున్నారు.ఈ ప్రాజెక్ట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన బన్నీ సుకుమార్ మైత్రీ వారు దీని కోసం భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్న విషయం తెలిసిందే. విదేశాల్లోనూ కీలక ఘట్టాల షూటింగ్ ని చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీలోకి కీలక పాత్రల్లో ఫహద్ ఫాజిల్ ధనుంజయ సునీల్ అనసూయతో పాటు మరో నటుడు కూడా కనిపించనున్నాడట.

ఇదిలా వుంటే బన్నీ తమిళ దర్శకుడు అట్లీకుమార్ తో భారీ ప్రాజెక్ట్ ని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సూపర్ హిట్ వెబ్ సిరీస్ `మనీ హైస్ట్` స్టోరీ లైన్ కు ఈ సినిమా కథ చాలా దగ్గరగా వుంటుందని ఈ ప్రాజెక్ట్ కు బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెబుతున్నారు. ప్రస్తుతం `పుష్ప 2`కు రెడీ అవుతున్న బన్నీ అది పూర్తి కాగానే అట్లీకుమార్ మూవీని సెట్స్ పైకి తీసుకెళతాడని ఇండస్ట్రీ వర్గాల టాక్.

అంతే కాకుండా ఈ మూవీని ప్రముఖ తమిళ ప్రొడక్షన్ కంపనీ లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించనుందని ఇందు కోసం స్టార్ హీరో అల్లు అర్జున్ కు రూ. 100 కోట్ల మేర భారీ ఆఫర్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. లైకా ప్రొడక్షన్స్ ప్రస్తుతం మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్` ని నిర్మించింది. ఇక అట్లీకుమార్ ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో `జవాన్` మూవీని రూపొందిస్తున్నాడు.

ఇదిలా వుంటే బన్నీ - అట్లీకు మార్ ప్రాజెక్ట్ ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రానున్నాయని కోలీవుడ్ వర్గాల సమాచారం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.