రీ రిలీజ్ ల జోరు.. ఈసారి ఖుషి ఎప్పుడంటే!

Sun Sep 25 2022 11:45:40 GMT+0530 (India Standard Time)

Kushi Movie Re Release

మహేష్ బాబు పోకిరి సినిమా తో మొదలైన రీ రిలీజ్ ల జోరు కంటిన్యూ అవుతోంది. పోకిరి మించి జల్సా... జల్సాను మించి చెన్నకేశవ రెడ్డి ఇలా రికార్డుల కోసం స్టార్ హీరోల అభిమానుల ఆరాటం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున తెలుగు స్టార్ హీరోల క్లాసిక్ సినిమాల యొక్క రీ రిలీజ్ ల జోరు ముందు ముందు కూడా కంటిన్యూ అవ్వబోతుంది.తాజాగా బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా కు 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా భారీ ఎత్తున రీ రిలీజ్ చేసి మంచి వసూళ్లను దక్కించుకున్నారు. ఇటీవల రీ రిలీజ్ అయిన సినిమాల యొక్క వసూళ్ల రికార్డును కూడా బ్రేక్ చేయడం జరిగిందట. దాంతో మళ్లీ పవన్ కళ్యాణ్ అభిమానులు సందడికి సిద్ధం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఖుషి సినిమాను రీ రిలీజ్ చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయట. డిసెంబర్ 31 మరియు జనవరి 1వ తారీకున ఖుషి సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరియు అమెరికా.. ఆస్ట్రేలియా ఇంకా పలు దేశాల్లో కూడా ఖుషి సినిమాను విడుదల చేస్తారట.

కొత్త సినిమాలు కూడా దక్కించుకోని వసూళ్లను ఖుషి రీ రిలీజ్ తో దక్కించుకోబోతున్నాం అని... దాంతో ఏ ఒక్కరు కూడా మళ్లీ రీ రిలీజ్ రికార్డుల జోలికి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు బెంచ్ మార్క్ ను క్రియేట్ చేయబోతున్నారట. అందుకోసం కాస్త ఎక్కువ సమయం ఉంది కనుక ఎక్కువగానే పబ్లిసిటీ కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారు.

రీ రిలీజ్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ అభిమానులు తాజాగా నమోదు అయిన రికార్డులను బ్రేక్ చేయాలని భావిస్తున్నారు. అప్పట్లో ఖుషి సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీ హిట్ అన్న రేంజ్ లో వసూళ్లను నమోదు చేసింది. కనుక ఈసారి ఖుషి వస్తే మళ్లీ రీ రిలీజ్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.