Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : శ్రీదేవి చిన్నమ్మాయి ఎంతగా మారిందో చూశారా!

By:  Tupaki Desk   |   18 Aug 2022 7:50 AM GMT
పిక్ టాక్ : శ్రీదేవి చిన్నమ్మాయి ఎంతగా మారిందో చూశారా!
X
శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటి వరకు కమర్షియల్ గా సక్సెస్ అవ్వకున్నా కూడా సోషల్‌ మీడియాలో హాట్‌ పోటోలు మరియు ఆమె యొక్క ఆకట్టుకునే అందంతో పాటు నటన విషయంలో తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటూ ఉండటం వల్ల ఇండస్ట్రీ లో రాబోయే రోజుల్లో టాప్ స్టార్‌ హీరోయిన్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జాన్వీ కపూర్‌ ఒక వైపు స్టార్‌ హీరోయిన్ గా దూసుకు పోతున్న సమయంలో శ్రీదేవి చిన్న కూతురు అయిన ఖుషి కపూర్ మాత్రం ఇంకా కెరీర్‌ లో ఎటు అడుగు వేయలేదు.

మొన్నటి వరకు ఈమె డైరెక్షన్‌ వైపు వెళ్తుందేమో అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కాని నటిగానే కెరీర్‌ ను ఎంపిక చేసుకుని ఖుషి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందంటూ తాజాగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఖుషి కపూర్‌ షేర్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నడుము నాభి అందాన్ని ఎక్స్‌ పోజ్ చేసి క్లీ వేజ్ షో తో కుర్రకారును రెచ్చగొడుతోంది.

అక్క జాన్వీ కపూర్‌ కి ఏమాత్రం తగ్గకుండా అన్నట్లుగా ఖుషి కూడా అందాల విందు చేసేందుకు సిద్ధం అన్నట్లుగా ఈ ఫోటోతో చెప్పకనే చెప్పింది. మొన్నటి వరకు ఖుషి కపూర్ ఒకలా ఉంది.. ఇప్పుడు చాలా మారి అందంగా కనిపిస్తుందంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం ఫోటో షూట్స్ వరకే పరిమితం అవ్వకుండా సినిమాలకు మరియు వెబ్‌ సిరీస్ లకు ఈ అమ్మడు సైన్ చేస్తోంది. రాబోయే రెండేళ్లలో ఖుషి కపూర్ నుండి పలు సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఖుషి కపూర్‌ తన తండ్రి సొంత బ్యానర్‌ లో ఒక సినిమాను చేసేందుకు సిద్ధం అవుతుందని వార్తలు వస్తున్నాయి. మరి అన్న మరియు అమ్మ మాదిరిగా ఖుషి హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకుంటుందో చూడాలి.