Begin typing your search above and press return to search.

శ్రీ‌దేవి రేర్ అన్ సీన్ ఫోటోగ్రాఫ్స్ వైర‌ల్

By:  Tupaki Desk   |   19 Jan 2022 12:30 AM GMT
శ్రీ‌దేవి రేర్ అన్ సీన్ ఫోటోగ్రాఫ్స్ వైర‌ల్
X
2018 ఫిబ్రవరి 24న అతిలోక సుంద‌రి శ్రీదేవి మరణించినట్లు వార్తలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దుబాయ్ లో బాత్ టబ్ లో ప‌డి `ప్రమాదవశాత్తు మునిగిపోవడం` కారణంగా మరణించార‌న్న వార్తను ఎవ‌రూ న‌మ్మ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత దుబాయ్ పోలీస్ విచార‌ణ‌లో ఈ మ‌ర‌ణాన్ని వివాదాస్ప‌దం చేయ‌లేదు.

శ్రీదేవి తన అంతుచిక్కని చిరునవ్వుతో తన పవర్ హౌస్ టాలెంట్ తో ప్రజల హృదయాలను దోచుకున్న ప్ర‌తిభావ‌ని. తాను మరణించిన దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఆమె అభిమానులు కుటుంబ సభ్యులు త‌న‌ని చాలా మిస్ అవుతున్న భావ‌న‌లో ఉన్నారు. శ్రీ‌దేవి చిన్న కుమార్తె ఖుషీ ఈరోజు తన తల్లిని చాలా ఎక్కువగా కోల్పోతున్న భావ‌న‌తో కనిపిస్తోంది.

స్టార్ కిడ్ తన ఇన్ స్టా స్టోరీలో శ్రీదేవి అందమైన త్రోబాక్ ఫోటోను షేర్ చేసింది. ఫోటోలో శ్రీదేవి తెల్లటి చీరలో ఆమె వెనుక వెర్మిలియన్ అని రాసిన బోనీతో అద్భుతంగా కనిపిస్తుంది. దుర్గాపూజ చివరి రోజు అయిన విజయదశమి నాడు వివాహిత స్త్రీలు సింధూర్ (వెర్మిలియన్)తో అద్దుకున్న చందంగా.. సెల‌బ్రేష‌న్ చేసుకునే సమయంలో బెంగాలీ సంప్రదాయమైన సింధూర్ ఖేలా నుండి ఫోటో తీయబడినట్లుగా కనిపిస్తోంది. ఫోటోలో శ్రీదేవి అందమైన కళ్ళు ఆమె మనోహరమైన చిరునవ్వు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

శ్రీదేవి- బోనీ కపూర్ ల చిన్న కుమార్తె .. జాన్వీ కపూర్ కి తోబుట్టువు అయిన ఖుషీ తరచుగా తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో తన తల్లి ఫోటోలను పంచుకుంటోంది. కొన్ని నెలల క్రితం.. ఆమె బోనీ కపూర్ తో శ్రీదేవి త్రోబాక్ ఫోటోను షేర్ చేసింది. దానికి `ది కూలెస్ట్` అని క్యాప్షన్ ఇచ్చింది. స్నాప్ లో యవ్వనంగా కనిపించే బోనీ-శ్రీదేవి జంట క‌నిపిస్తున్నారు.

దీనికి తోడు, గత సంవత్సరం మదర్స్ డే నాడు ఖుషీ తన చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండి తన తల్లి శ్రీదేవి ఒడిలో కూర్చున్నప్పటి ఫోటోని షేర్ చేసింది. ఇందులో ఆమె సోదరి జాన్వి వారి పక్కనే ఉంది. శ్రీదేవి తన ఒత్తైన నల్లటి జుట్టు -సూట్.. బిందీ లుక్ తో ఫోటోలో యంగ్ గా అందంగా కనిపిస్తోంది. ఆమె ఈ ఫోటోకు అంద‌మైన‌ క్యాప్షన్ ఇచ్చింది.. ``ఉత్తమ మదర్స్ డే`` శుభాకాంక్షలు అని తెలిపింది.