ఖుషీ ఖుషీగా బికినీ ట్రీట్.. జాన్వీ ఇక ఇంటికే!

Fri Jun 18 2021 19:47:32 GMT+0530 (IST)

Kushi Kapoor Latest Photo

ఒక్క ఫోటోతో  మైండ్ బ్లాక్ చేసింది. బోయ్స్ ని గగ్గోలు పెట్టించింది. బికినీతో జిల్ జిల్లనిపించింది. ఇక ఇదే దూకుడు చూపిస్తే ఇక పోటీ బరిలో స్టార్ కిడ్స్ అంతా ఇంటికే. ఇప్పటికే రేసులో ఉన్న జాన్వీ కపూర్ కూడా ఇంటి బాట పట్టాలేమో.. సిస్టర్ ఖుషీ పోటీ తట్టుకోలేక..ప్రస్తుతం ఖుషీ కపూర్ బికినీ లుక్ చూశాక కుర్రకారు ఫీలింగ్ ఇదే. యూత్ ఆ ఒక్క లుక్ కి మతి చెడి కంటికి కునుకుపట్టని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. ఉన్నట్టుండి ఖుషీ ఈ రేంజులో చెలరేగుతుందని ఎవరూ ఊహంచనే లేదు. నిజానికి జాన్వీ కపూర్ ఆరంభం ఇంత స్పీడ్ చూపించలేదు. నెమ్మదిగా పొట్టి నిక్కర్లతో మొదలు పెట్టి ఆ తర్వాత బికినీలోకి దిగింది. కానీ ఖుషీ అలా కాదు. ఇంకా స్టార్ కాక ముందే ఇలా వంగపువ్వు రంగు బికినీతో దుమారం రేపింది.

ఇక మాల్దీవుల విహారం నుంచి జాన్వీ బికినీ ట్రీట్ ని కూడా మించిపోయేలా మరికొన్ని ఫోటోలను ఖుషీ సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. ముఖ్యంగా ఖుషీ ఇన్ స్టాగ్రమ్ లో మంటలు పెట్టేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలన్నీ హాట్ కేక్ ల్లా వైరల్ అయిపోతున్నాయి.

ఈత కొలనులోకి అడుగు పెట్టడానికి ముందు బికినీ లుక్ లో ఖుషీ అలా చిల్ చేసింది. ఓ రెండు బికినీ ఫోటోలను షేర్ చేయగా వైరల్ గా మారాయి. చుట్టూ ఉన్న పచ్చదనం కొండల నేపథ్యంతో ఈ ఫోటోలు ఆకర్షణీయంగా కనిపించాయి. ఖుషీ `పూల్ డే` అని శీర్షిక ను ఇచ్చింది.

ఈ బికినీ లుక్ షేర్ చేయగానే అభిమానులు సన్నిహితులు వ్యాఖ్య విభాగంలో ఖుషీకి అభినందనలు తెలిపారు. అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా క్యూటీ అని వ్యాఖ్యానించగా.. కజిన్ మహీప్ కపూర్ హార్ట్ ఈమోజీలను షేర్ చేశారు. అనన్య పాండే .. కాబోయే నటి షానయా కపూర్ శుభాకాంక్షలు తెలిపారు. ఖుషీ తన కజిన్ షానయ కపూర్ తో సోషల్ మీడియా పరిహాసాల గురించి తెలిసినదే. ఇటీవలే షానయా తన అభిమానులను న్యూయార్క్ నగర వీధుల్లో షికార్ కి సంబంధించిన త్రోబాక్ ఫోటోలను షేర్ చేయగా వైరల్ అయ్యాయి.

ఖుషి- షానయ స్నేహితులిద్దరూ బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధమవుతున్న సందర్భమిది. ఆ ఇద్దరూ ఒకరితో పోటీపడి ఒకరు చెలరేగుతున్నారు. బోనీ కపూర్ తన చిన్న కుమార్తె ఖుషీ తన డెబ్యూ కోసం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఖుషీ తెరంగేట్రంపై త్వరలో ఒక ప్రకటన చేస్తామని అన్నారు. ఇటీవల ఖుషీ న్యూయార్క్ లో యాక్టింగ్ కోర్సు లో శిక్షణ పొంది ప్రస్తుతం భారతదేశానికి తిరిగి వచ్చారు.