వీడియో: ఇదేంటీ టేబుల్ పై పటానీ నాగిని నాట్యం!

Wed Nov 24 2021 18:40:52 GMT+0530 (IST)

Kushboo Patani Dance Video

బాలీవుడ్ హాట్ గాళ్ దిశా పటానీ సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో ఒకరు. తరచుగా తన ఇన్ స్టాగ్రామ్ లో వర్కౌట్ వీడియోలు.. గూఫీ రీల్స్.. బికినీ చిత్రాలను పంచుకుంటుంది. దిశా సోషల్ మీడియా పోస్ట్ లు ఆమె 47.5 మిలియన్ల మంది అనుచరులకు ఎల్లప్పుడూ ట్రీట్ అయితే.. ఈరోజు మరింత ప్రత్యేకమైన ట్రీట్ అందింది. దిశా సోదరి ఖుష్బూ పటానీ సోమవారం బర్త్ డే సెలబ్రేషన్స్ తో ధమాకా ట్రీట్ కి సిద్ధమైంది.ప్రస్తుతం ఖుష్భూ - తన బెస్ట్ ఫ్రెండ్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న దిశా పటానీ.. తమ గోవా ట్రిప్ నుంచి ఫోటోల బంచ్ ని పంచుకుంది. ఈ సందర్భంగా తన అందమైన సోదరికి శుభాకాంక్షలు తెలిపారు దిశా. అలాగే ఖుష్బూ  డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. శాటిన్ స్లిప్ డ్రెస్ లో ఖుష్బూ టేబుల్ పైన డ్యాన్స్ చేస్తూ కనిపించింది. క్యాప్షన్ లో ఆమె ఇలా రాసింది. ``హ్యాపీ బర్త్ డే మై క్రేజీ సిస్సీ హే.. నేను మీలా డ్యాన్స్ చేయాలనుకుంటున్నాను`` అని వ్యాఖ్యానించింది. అయితే ఈ వీడియోకి కామెంట్లు అదే రేంజులో ఉన్నాయి.

ఇక దిశా షేర్ చేసిన మరో వీడియోలో ఖుష్బూ - అలెగ్జాండర్ ది వీకెండ్ స్టార్ బాయ్ సాంగ్ కి డ్యాన్స్ చేస్తున్నారు. టేబుల్ పై ఉన్న ఖుష్బూ సిజ్లింగ్ కదలికలు గుబులు రేపాయి. ఇదేంటీ టేబుల్ పై పటానీ నాగిని నాట్యం! అని ఒక అభిమాని కామెంట్ చేయగా.. కొందరు ఛీఛీ.. ఒళ్లు మరిచి ఎలా డ్యాన్స్ చేస్తుంది. తనో ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మరించిందా.. ఆవిడేమీ హీరోయిన్ కాదు.. కొంచం పద్దతిగా ఉండాలి! అంటూ కౌంటర్లు పడిపోతున్నాయ్.  ఖుష్బూ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్ నెంట్ గా విధులు నిర్వర్తిస్తోంది. దిశా పటాని ఎప్పుడైతే తన అక్క ఆర్మీ ఆఫీసర్ అని వెల్లడించిందో అప్పటి నుంచి ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఖుష్బూ భారత ఆర్మీలో పనిచేస్తున్నప్పటికీ దిశాలాగే ఫిట్ నెస్ ప్రియురాలు. నిరంతరం జిమ్ ని ఆశ్రయిస్తుంది ఈ బ్యూటిఫుల్ సిస్టర్.

దిశా తన సోదరి -బెస్ట్ ఫ్రెండ్ తో బీచ్ సెల్ఫీని కూడా పంచుకుంది. ఫోటోలో పటానీ సోదరీమణులు స్విమ్ సూట్ లు వేసుకుని కనిపించారు. ఖుష్బూ పసుపు రంగు టై అప్ బికినీ ధరించగా.. దిశా రెడ్ ప్రింటెడ్ బికినీలో కనిపించింది.