అలా చూసి రమ్యక్రిష్ణకు ఫోన్ చేసి తిట్టా

Mon Dec 10 2018 10:34:37 GMT+0530 (IST)

బాహుబలి చూశాక రమ్యక్రిష్ణ కు ఫోన్ చేసి తిట్టానని సంచలన నటి ప్రస్తుత రాజకీయ నాయకురాలైన కుష్ణు వ్యాఖ్యానించారు. రమ్యక్రిష్ణ ఆ సినిమాలో చేసిన నటన చూస్తే తనకు గూస్ బాంబ్స్ వచ్చాయని.. ఏం చేశావే అని ఫోన్ చేసి చెడామడా తిట్టానని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కుష్బు తనకు రమ్యక్రిష్ణ క్లోజ్ ఫ్రెండ్ అని.. తామిద్దరం సినీ ఇండస్ట్రీలో బాగా ఉంటామని చెప్పుకొచ్చారు.బాహుబలి లో రమ్యక్రిష్ణ నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డ్ రావాలని.. కానీ అది రాకపోవడం బాధ కలిగిందని కుష్బు అన్నారు. సినీ విమర్శకులు సైతం మెచ్చుకునేలా రమ్యక్రిష్ణ ఆ సినిమాలో చేసిందని మెచ్చుకున్నారు. బాహుబలిలో ఇద్దరు పిల్లలకు పాలిచ్చే సన్నివేశంలో రక్తం ముఖంపై ఉన్నా తన హావభావాలు చూస్తే మతిపోయిందని కుష్బు వ్యాక్యానించారు.

ఆ సినిమా చూడగానే తాను రమ్య క్రిష్ణ కు ఫోన్ చేసి.. నీ నటన బాగాలేదు.. నాకు నచ్చలేదు. ఎందుకిలా చేశావే అని చెడామడా తిట్టానని కుష్బు చెప్పుకొచ్చారు. దానికి రమ్యక్రిష్ణ గట్టిగా నవ్వి థ్యాంక్యూ అని చెప్పిందని కుష్బు తెలిపారు.

రమ్యక్రిష్ణ కు ఇప్పటివరకు నటనకు తగ్గ పాత్రలు దక్కలేదని.. రజనీకాంత్ తో నరసింహ తర్వాత బాహుబలిలో శివగామి పాత్ర పీక్ స్టేజ్ కు తీసుకెళ్లాయని కుష్బు తెలిపారు. దర్శకులు కూడా ఆమె ప్రతిభను గుర్తించలేదని అన్నారు.