Begin typing your search above and press return to search.

చాలా రోజుల తర్వాత మురిపించిన హ్యారిస్ జయరాజ్

By:  Tupaki Desk   |   20 July 2019 7:30 AM GMT
చాలా రోజుల తర్వాత మురిపించిన హ్యారిస్ జయరాజ్
X
సౌత్ లో ఉన్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో హ్యారిస్ జైరాజ్ ఒకరు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా అయన ఎన్నో చార్ట్ బస్టర్ అందించాడు. అయితే ఎందుకో గత కొంత కాలంగా తన రేంజ్ మ్యూజిక్ అందించలేకపోతున్నాడు. మహేష్ బాబు - ఎఆర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన 'స్పైడర్' మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. ఆ సినిమాలో ఏదైనా ఒక పాట చెప్పమంటే చాలు..సాధారణ ప్రేక్షకులెవరైనా గుడ్లు తేలేయాల్సిందే. మహేష్ కెరీర్లో వచ్చిన వీకెస్ట్ ఆల్బమ్స్ లో 'స్పైడర్' ఒకటి.

అయితే తాజాగా హారిస్ జయరాజ్ తమిళ స్టార్ హీరో సూర్య కొత్త సినిమా 'కాప్పాన్' కు సంగీతం అందిస్తున్నాడు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి నిన్నే 'కురిలే కురిలే' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. పాట తమిళమే.. కానీ మ్యూజిక్ మాత్రం సూపర్ గా ఉంది. నాలుగు సార్లు వింటే ఇక వదలడం కష్టం. చాలా రోజుల తర్వాత హ్యరిస్ తన స్టైల్ లో ఉండే మంచి ట్యూన్ ఇచ్చాడనే అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తం అవుతోంది. ఈ పాటను జావేద్ అలి.. దర్శన కె.టి ఆలాపించారు.

కెవీ ఆనంద్ - సూర్య కాంబినేషన్ లో గతంలో తెరకెక్కిన 'అయన్'(వీడొక్కడే'.. 'మాట్రాన్'(బ్రదర్స్) బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించడంతో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. 'కాప్పాన్' లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. ఆర్య.. బొమన్ ఇరాని.. సముద్రకని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ సాయేషా సెహగల్. మరి సినిమా రిలీజ్ అయ్యేలోపు ఈ తమిళ కురిలే పై ఒక లుక్కేయండి.