పెదవులకు ఫిల్టర్లు వేయాలన్న పోకిరీలకు ట్విస్టు!

Tue Jan 18 2022 13:01:41 GMT+0530 (IST)

Kriti filters on their lips

సోషల్ మీడియాల్లో హద్దుమీరిన ట్రోలింగ్ నిరంతరం హాట్ టాపిక్ గా మారుతోంది. సెలబ్రిటీలు ఇందుకు ప్రధాన బలిక్రతువుగా మారుతున్నారు. హీరోయిన్లు అందుకు మినహాయింపు కాదు! బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ఇటీవల ట్రోలింగ్ బారిన పడిన సంగతి తెలిసిందే. కృతి అందాన్ని.. రూపాన్ని విమర్శిస్తూ నెటిజనులు కామెంట్లు చేసారు. తాజాగా ఈ కామెంట్లపై కృతి సనన్ ఒక్కో కామెంట్ ని గుర్తు చేసి మరీ వాటికి సమాధానం ఇచ్చింది. నా పెదవులు నిండుగా అందంగా కనిపించాలంటే పిల్టర్లు వేయమని కొందరు ఉచిత  సలహాలు ఇచ్చారు. అలాగే నవ్వితే ముక్కు రంధ్రాలు మెరిసిపోతున్నాయని కామెంట్ చేస్తున్నారని కూడా వాపోయింది. మీరు ఇలాంటి కామెంట్లు ఎన్ని చేసినా పట్టించుకోను. నేనేమీ ప్లాస్టిక్ బొమ్మను కాదు అని అన్నింటికి ఒకే సమాధానం ఇచ్చింది.మరికొంత మంది `గమ్మీ స్మైల్` అని లేబుల్ చేస్తూ ట్వీట్ చేయడంపైనా స్పందించింది కృతి. జవాబుగా కృతి ఏమందంటే?  నేను అలాగే పుట్టాను. దాని గురించి నేనేమీ చేయలేను అంది. అలాగే బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ... కొంత మంది నా నడుముని స్లిమ్ చేయమని కోరారు. మనమందరం కలలు కనే పరిపూర్ణ ఆకృతిలో ఉన్నందున  దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని తెలిపింది. అలాగే పిల్టర్లతో ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నాను. ప్రతీ ఒక్కరూ  అన్ని సమయాలలో పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు.

నేను  ఆవిధంగానే ఉన్నాను. మహిళలు ఎవరూ అందరి మాటలు వినొద్దని.. తమంతట తాముగానే ఉండాలని కృతి సనన్ సూచించింది.

ఇక ఈ బ్యూటీ సినిమాల  విషయానికి వస్తే అక్షయ్ కుమార్  సరసన `బచ్చన్ పాండే`లో నటిస్తోంది. అలాగే  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన `ఆదిపురుష్3డి` లో సీత పాత్రలోనూ నటిస్తోంది.  కార్తిక్ ఆర్యన్ తో `షెహజాద్` లో..వరుణ్ ధావన్ తో కలిసి హారర్ కామెడీ ఎంటర్ టైనర్ `భేదియా` లోనూ..యాక్షన్ థ్రిల్లర్ `గణపత్` లోనూ నటిస్తోంది. ఇటీవలే మిమి చిత్రంతో ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఇక తెలుగులో `వన్` చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. కానీ టాలీవుడ్ లో అమ్మడి కెరీర్ ఆశించనంతగా సాగలేదు. ఆదిపురుష్ తనకు బిగ్ బ్రేక్ నిస్తుందని ఆశిస్తోంది.